వెంకటేష్ కూతురి పెళ్ళిలో సమంత సందడి..!

ఇటీవల జరిగిన విక్టరీ వెంకటేష్ కూతురి వివాహ వేడుకలో అక్కినేని కోడలు సమంత తెగ సందడి చేసింది. ఈ వేడుకలో కుటుంబ సభ్యుల సమక్షంలో ‘ఆర్మ్ రెజ్లింగ్’ విన్యాసాలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. రానా – చైతు కూడా సమంత పక్కనే ఉండటం విశేషం. చివరికి ఈ ఫైట్ లో ప్రత్యర్థి అయిన దగ్గుబాటి అమ్మాయిని ఓడించి సమంత విజేతగా నిలిచింది. దీనికి సంబందించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.

ఇక సమంత తన భర్త చైతన్యతో కలిసి నటిస్తున్న ‘మజిలీ’ చిత్రం ఏప్రిల్ 5 న విడుదల కాబోతుంది. ఇక దీనితో పాటూ తమిళ్ లో విజయ్ సేతుపతి సరసన నటించిన ‘సూపర్ డీలక్స్’ కూడా త్వరలోనే విడుదల కాబోతుంది. ఇక ఇటీవల షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ‘ఓ బేబీ’ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. నందినీ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో సమంత వృద్ధ వయసులో వుండే పాత్రను… అలాగే యంగ్ ఏజ్లో ఉండే అమ్మాయిగా ఈ చిత్రంలో సమంత కనిపించబోతుందని సమాచారం. వీటితో పాటూ కొన్ని యాడ్స్ లో కూడా నటిస్తూ బిజీగా గడుపుతుంది సమంత.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus