Samantha: సమంత బాలీవుడ్‌ ఎంట్రీ పై క్లారిటీ!

బ్రేకప్‌ తర్వాత సమంత జోరు పెంచింది… గత కొన్ని రోజులుగా ఈ మాట మనం చెప్పుకుంటూనే ఉన్నాం. వరుసగా సినిమాలు ఓకే చేసుకుంటోంది అని కూడా అంటున్నాం. అయితే ఈ క్రమంలో బాలీవుడ్‌ ఎంట్రీ కూడా ఫిక్స్‌ అయింది అని కూడా వార్తలొచ్చాయి. నిర్మాత కూడా ఫిక్స్ అయ్యారని, మల్టీస్టారర్ అని కూడా వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు చూస్తే పరిస్థితి మారింది. సమంత వాయిస్‌ కూడా మారింది. ‘శాకుంతలం’, ‘కాతువాకుల రెండు కాదల్‌’ రూపంలో ఇప్పటికే రెండు సినిమాలు కంప్లీట్‌ చేసింది సమంత.

ఇవి కాకుండా మరో సినిమాలకు సైన్ చేసింది. బై లింగ్వుల్‌గా ఆ సినిమాలు తెలుగు, తమిళంలో తెరకెక్కనున్నాయి. అన్నట్లు ‘పుష్ప’లో అల్లు అర్జున్‌ సరసన ప్రత్యేక గీతం చేయడానికి అంగీకరించింది. ఈ క్రమంలో ఇంకో సినిమా బాలీవుడ్‌యేనా అని సమంతను సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ అడుగుతున్నారు. ఇదే మాట ఓ మీడియా సంస్థ కూడా సామ్‌ను అడిగింది. దానికి సమంత… చెప్పిన సమాధానం చూస్తే… బాలీవుడ్‌ ఎంట్రీ విషయంలో ఏదో తేడా కొట్టినట్లుంది.

సినిమా ఓకే చేయడంలో భాష నాకు సమస్య కాదు. కథలో జీవం ఉందా అనేది చూస్తా. ఆ కథకు నేను సరిపోతానా అని ప్రశ్నించుకుంటా. అవును అనే సమాధానం వస్తే… వెంటనే ఓకే చేసేస్తా. మంచి స్క్రిప్ట్‌ నా దగ్గరికొస్తే… బాలీవుడ్‌లో అడుగు పెడతా. నాకూ బీటౌన్‌కి వెళ్లాలనే ఆసక్తిగా ఉంది అని చెప్పింది. ఈ లెక్కన సామ్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఆలస్యమయ్యేలా ఉంది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus