మరో సారి నానికి జోడీగా సమంత

ప్రస్తుతం నాగార్జున రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నటిస్తున్నారు. పోలీస్ ఆఫీసర్ గా నాగ్ నటిస్తున్న ఈ చిత్రానికి శపథం అనే పేరు అనుకుంటున్నారు. ఈ మూవీ కంప్లీట్ కాకముందే మరో చిత్రాన్ని మొదలు పెట్టనున్నారు. “భలే మంచిరోజు”, “శమంతకమణి” సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నటించనున్నారు. ఇందులో నేచురల్ స్టార్ నాని.. నాగ్ తో కలిసి నటించనున్నారు. ఈ మల్టీ స్టారర్ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మిస్తున్నారు. ఈ నెల 24 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఫిక్స్ అయింది.

ఈ సినిమాలో నానికి జోడిగా సమంత నటించబోతోందని సమాచారం. వీరిద్దరూ కలిసి గతంలో ఈగ సినిమా చేశారు. ఇది ఈ జోడీకి రెండో సినిమా అయితే నాగార్జున సినిమాలో సమంత కనిపించడం మూడో సారి అవుతుంది. ఇది వరకు మనం, రాజుగారి గది 2 చిత్రాల్లో మామ, కోడలు కనిపించారు. ఇప్పుడు ఇందులో మూడోసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. సమంత ప్రస్తుతం “సూపర్‌ డీలక్స్” అనే తమిళ చిత్రంలో విజయ్‌కి జోడీగా నటిస్తోంది. చరణ్ తో ఆమె నటించిన ‘రంగస్థలం’ మార్చి 30 న విడుదలకానుంది. అలాగే జమునగా కనిపించనున్న ‘మహానటి’ కూడా విడుదలకు ముస్తాబు అవుతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus