Samantha: బాలీవుడ్ కు మకాం మార్చబోతున్న అక్కినేని వారి కోడలు..!

అక్కినేని వారి ఇంటి కోడలు అయిన సమంత… బాలీవుడ్ కు మకాం మార్చాలని భావిస్తుందా? అనే విషయం పై ప్రస్తుతం డిస్కషన్ షురూ అయ్యింది. అసలు ఈ చర్చకు గల కారణాలు ఏంటి? అని ఆరా తీయగా.. సమంత ముంబైలో ఇల్లు కోసం అన్వేషించడమే అని తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో బాలీవుడ్లో సినిమాలు చేస్తున్న టాలీవుడ్ స్టార్లు వరుసగా ముంబైలో ఇల్లు కొనుగోలు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆల్రెడీ ప్రభాస్ ముంబైలో ఇల్లు తీసుకున్నాడు, రీసెంట్ గా రష్మిక కూడా అక్కడ ఇల్లు తీసుకున్నట్టు ప్రచారం జరిగింది.

ఇప్పుడు సమంత కూడా వారి బాటలోనే నడుస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.నిజానికి నాగ చైతన్య, సమంతలకు హైదరాబాద్ లో అందమైన, విలాసవంతమైన ఇల్లు ఉంది. ఈ మధ్యనే గోవాలో కూడా ఓ ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.ఇప్పుడు ముంబైలో కూడా ఇల్లు కొనుగోలు చేసేందుకు చూస్తున్నట్లు వినికిడి.‘ది ఫ్యామిలీ మేన్ 2’ సిరీస్ విజయవంతమవ్వడంతో సమంతకి బాలీవుడ్ నుండీ మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఆ సిరీస్ నేషనల్ వైడ్ పాపులర్ అవ్వడంతో సమంతకి బాలీవుడ్లో కూడా డిమాండ్ పెరిగింది.కానీ ప్రస్తుతానికి అయితే సమంత ఏ ప్రాజెక్టుని అంగీకరించలేదు.

బాలీవుడ్లో కూడా రాణించాలనే ఆలోచన తనకి లేదు.గతంలో కూడా సమంతకు బాలీవుడ్ ఆఫర్లు వచ్చాయి. కానీ వాటికి ఆమె నో చెప్పింది. అయితే సమంత భర్త నాగ చైతన్య ప్రస్తుతం అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘లాల్ సింగ్ చద్దా’లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. దాని తర్వాత చైతన్యకి అక్కడ మంచి ఆఫర్లు వస్తాయని భావించి… ఇన్వెస్ట్ మెంట్ పద్ధతి ప్రకారం ముంబైలో ఇల్లు కోసం అన్వేషిస్తున్నారా? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం పై క్లారిటీ రావాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే..!

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus