స్టార్ హీరోయిన్ సమంత పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సాంగ్ కోసం సమంత రికార్డు స్థాయిలో పారితోషికం తీసుకున్నారని వార్తలు తెగ వైరల్ అయ్యాయి. విడాకుల ప్రకటన తర్వాత సమంత స్పెషల్ సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. అయితే దర్శకుడు సుకుమార్ కు సమంత స్పెషల్ సాంగ్ కు సంబంధించి కొన్ని షరతులు పెట్టారని సమాచారం.
ఈ స్పెషల్ సాంగ్ కోసం దేవి శ్రీ ప్రసాద్ అదిరిపోయే ట్యూన్ ను సిద్ధం చేశారని తెలుస్తోంది. మొదట హైదరాబాద్ లో ఉండే ప్రముఖ స్టూడియోలో ఈ సాంగ్ షూటింగ్ జరపాలని సుకుమార్ భావించగా సమంత మాత్రం ఈ సాంగ్ షూటింగ్ ను రామోజీ ఫిల్మ్ సిటీకి మార్చాలని కోరారని సమాచారం. సాంగ్ కొరకు వేసిన సెట్లు, ఫోటోలు లీక్ కాకుండా చూడాలని సుకుమార్ ను సమంత కోరినట్టు బోగట్టా.
మీడియా నుంచి, అభిమానుల నుంచి ఎటువంటి అసౌకర్యం కలగకూడదని భావించి సమంత ఈ షరతులు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ సాంగ్ షూటింగ్ కొరకు సమంత ఐదు రోజుల కాల్షీట్లను కేటాయించినట్టు తెలుస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్పెషల్ సాంగ్ కొరకు ప్రత్యేకమైన బీట్ ను సిద్ధం చేశారని సమాచారం. ప్రైవసీ కావాలని కోరుకుంటున్న సమంత ఈ షరతులను విధించినట్లు తెలుస్తోంది. గతంలో కొంతమంది హీరోయిన్లు స్పెషల్ సాంగ్ తో మెప్పించగా సమంత కూడా స్పెషల్ సాంగ్ తో మెప్పిస్తారేమో చూడాల్సి ఉంది.