Samantha: సమంతని చీట్ చేసి రూ.1 కోటి కొట్టేసిన మేనేజర్?

  • September 22, 2023 / 12:10 AM IST

స్టార్ హీరోలు లేదా హీరోయిన్ల కెరీర్ విషయంలో వారి మేనేజర్లు తీసుకునే నిర్ణయాలు కీలకంగా ఉంటాయి. మేనేజర్ కనుక సరిగ్గా లేడు అంటే.. వీళ్ళ కెరీర్ పై ప్రభావం పడుతుంది. గతంలో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.. తన మేనేజర్ వల్ల తన ఇమేజ్ దెబ్బతిన్నట్టు చెప్పి అందరికీ షాకిచ్చింది. మొన్నటికి మొన్న సాయి ధరమ్ తేజ్ మేనేజర్ కూడా అతన్ని మభ్యపెట్టి రూ.4 కోట్లు టోకరా వేసినట్టు ఇన్సైడ్ టాక్ నడిచింది.

ఆ తర్వాత రష్మిక మందన కూడా తన మేనేజర్ చేతిలో మోసపోయినట్టు టాక్ నడిచింది. ఆమెను చీట్ చేసి.. తన మేనేజర్ రూ.80 లక్షలు కొట్టేసాడు అనే టాక్ నడిచింది. కానీ తర్వాత అలాంటిదేమి లేదు అంటూ ఇద్దరూ అధికారిక ప్రకటన చేసి ఆ ఇష్యుకి ఫుల్ స్టాప్ పెట్టారు. అయితే ఇటీవల రష్మిక లానే మరో స్టార్ హీరోయిన్ కూడా మోసపోయినట్టు సమాచారం. ఆమె మరెవరో కాదు సమంత. అవును.. సమంతని కూడా తన మేనేజర్ మోసం చేసి రూ.1 కోటి కొట్టేసినట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

ఈ విషయంతో కూడా సమంత (Samantha) మానసికంగా ఇంకా డిస్టర్బ్ అయినట్లు తెలుస్తుంది. సమంత కొన్నాళ్ల పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వడానికి ఇది కూడా ఓ కారణమని, మాయోసైటీస్ వల్ల కూడా ఆమె చాలా ఇబ్బంది పడుతుంది అని తెలుస్తుంది. ఈ ఏడాది సమంత నటించిన ‘శాకుంతలం’ డిజాస్టర్ అవ్వగా, ‘ఖుషి’ హిట్ టాక్ తెచ్చుకుని కూడా బాక్సాఫీస్ వద్ద రికవరీ కాలేకపోయింది అని తెలుస్తుంది.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus