30 రోజుల టార్గెట్‌ సెట్‌ చేసుకున్నా- సమంత

అక్కినేని నాగచైతన్యని సమంత పెళ్లిచేసుకున్న తర్వాత ఒక టార్గెట్ పెట్టుకుంది. హనీమూన్ అంటూ ఎంజాయ్ చేయకుండా.. అనుకున్నసమయానికి తాను అంగీకరించిన సినిమాలను కంప్లీట్ చేయాలనీ అనుకుంది. అనుకున్నట్టుగానే రంగస్థలం, మహానటి, ‘అభిమన్యుడు(తమిళం)” సినిమాలను కంప్లీట్ చేసింది. ఇందులో రంగస్థలం గత నెల రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది. ఇక మిగిలిన రెండు సినిమాలు త్వరలో విడుదల కానున్నాయి. ఈ సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత భర్తతో కలిసి రెండు వారాలపాటు విహరించి వచ్చింది. వచ్చి రాగానే మరో కొత్త టార్గెట్ పెట్టుకుంది. అందుకు ముప్పై రోజులు సమయాన్ని కేటాయించింది.

ఆ టార్గెట్ ఏమిటో వివరాల్లోకి వెళితే… సమంత ఎంత బిజీగా ఉన్న వర్కౌట్ చేయడం మాత్రం ఆపదు. ప్రతి రోజూ జిమ్ కి వెళ్లాల్సిందే. తాను జిమ్ లో ఉన్న ఫోటోలు, వీడియోలను అనేకసార్లు సోషల్ మీడియాలో షేర్ చేసింది కూడా. కానీ తొలిసారి పుల్ అప్ చేయడంలో విఫలమైంది. దీని గురించి ఓ వీడియోను ఈరోజు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పోస్ట్‌ చేసింది. “తొలిసారి నేను పుల్‌అప్‌ ప్రయత్నించా. ఘోర పరాజయం పొందా. 30 రోజుల టార్గెట్‌ సెట్‌ చేసుకున్నా. నేను చేయగలనని మీరు అనుకుంటున్నారా?” అని అభిమానుల్ని ప్రశించింది. సమంత అనుకున్నది సాధిస్తుందని ఆమె అభిమానులు ధీమాగా చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus