Samantha: మయోసైటిస్‌.. ఎప్పుడు తెలసిందంటే.. తొలినాళ్లలో ఎలా?

విడాకులు తీసుకున్న తర్వాత సమంతకు (Samantha)  ఏమంత మంచి పరిస్థితులు లేవు. ఓవైపు సోషల్‌ మీడియాలో ఆమె మీద జనాలు పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోశారు. ఆ తాకిడి నుండి తట్టుకుంటున్న సమయంలో అనూహ్యంగా అనారోగ్యం పాలైంది. ‘సమంతకు ఏమైంది?’ అనే ప్రశ్న ఎక్కువ రోజులు ప్రజల నోళ్లలో నానకముందే ఆమే తనకు ‘మయోసైటిస్‌ అనే రుగ్మత వచ్చింది’ అని క్లారిటీ ఇచ్చేసింది. దీంతో ఏంటీ మయో సైటిస్‌ ఎందుకొస్తుంది, ఎలా వస్తుంది, వస్తే ఏమవుతుంది, వైద్యం ఏంటి, పరిస్థితి ఏంటి అంటూ పెద్ద ఎత్తున చర్చలు, స్పందనలు చెప్పేశారు.

Samantha

ఆ తర్వాత సమంతనే డైరెక్ట్‌గా తన పరిస్థితులు చెప్పింది. అయితే తాజాగా సమంత తనకు మయోసైటిస్‌ రావడం గురించి, అంతకుముందు జరిగిన అంశాల గురించి మాట్లాడింది. ఇప్పుడు ఆ మాటలు వైరల్‌గా మారాయి. సమంత ఇప్పటికీ మయోసైటిస్‌ రుగ్మతకు చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ మొదటిసారి లక్షణాలు కనిపించిన రోజులను గుర్తుచేసుకుంది.

‘కాఫీ విత్‌ కరణ్’ టాక్‌ షోలో పాల్గొన్నప్పుడు తొలిసారి మయోసైటిస్‌ లక్షణాలు కనిపించాయని సమంత చెప్పింది. ఆ సమయంలో ఒక్కసారిగా శరీరమంతా నీరసంగా ఉన్నట్లు అనిపించిందని తెలిపింది. అయితే షోలో కూర్చునే ఓపిక లేకపోయినా టాక్‌షో పూర్తి చేసి హైదరాబాద్‌ వచ్చేశానని, మరుసటి రోజు ‘ఖుషి’ (Kushi) సినిమా షూటింగ్‌కు వెళ్లానని సమంత చెప్పింది. అయితే అక్కడా ఇబ్బందిగా అనిపించింది అని చెప్పింది సామ్‌.

అప్పటి నుండి ఆరోగ్యం రోజు రోజుకు క్షీణించడం మొదలుపెట్టిందని, ఆ వ్యాధిని గుర్తించడానికి అర్థం కావడానికి చాలా సమయం పట్టిందని చెప్పింది. సమంత 2022లో అక్షయ్‌ కుమార్‌తో (Akshay Kumar) కలసి సమంత ‘కాఫీ విత్‌ కరణ్‌ షో’కి వెళ్లింది. ఆ కార్యక్రమంలో తన వ్యక్తిగత విషయాల గురించి తొలిసారి కామెంట్‌ చేసింది సమంత. విడాకుల గురించి మొదటిసారి అక్కడే మాట్లాడింది. తను, నాగచైతన్య (Naga Chaitanya) ఒక గదిలో ఉంటే దగ్గరల్లో కత్తులు పెట్టకూడదు అని తమ మధ్య ఉన్న వైరం గురించి చెప్పింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus