Samantha: ఆ కామెంట్ తో అభిప్రాయం చెప్పేసిన సామ్!

స్టార్ హీరోయిన్ సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్న సమయంలో నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. నెటిజన్లలో ఎక్కువమంది విడాకుల ప్రకటన విషయంలో సమంతదే తప్పు అని కామెంట్లు చేశారు. కొంతమంది నెటిజన్లు ఏకంగా సమంత పిల్లల్ని కనడానికి ఇష్టపడలేదని ఆ రీజన్ వల్లే చైసామ్ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయనే కామెంట్లు చేశారు. సమంత వైరల్ అయిన వార్తలను ఖండించినా కొంతమంది ఆ వార్తలను నిజమేనని నమ్మారు. తాజాగా సమంత ఒకే ఒక్క కామెంట్ తో ఆ విమర్శలకు చెక్ పెట్టారు.

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం గర్భవతి అనే సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితమే కాజల్ గర్భవతి అని వార్తలు వైరల్ అయినా తాజాగా కాజల్ దంపతుల నుంచి ఈ మేరకు స్పష్టత వచ్చింది. తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో కాజల్ ఒక వీడియోను విడుదల చేసి గర్భవతి అయిన విషయాన్ని పంచుకున్నారు. కాజల్ అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించడంతో సెలబ్రిటీలు కాజల్ కు శుభాకాంక్షలు తెలిపారు. స్టార్ హీరోయిన్ సమంత కాజల్ గర్భవతి కావడం గురించి స్పందిస్తూ చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు.

ప్రియమైన కాజల్ నీపై నాకు చాలా ప్రేమ ఉందని సమంత అన్నారు. అందంగా ఉన్న పడుచు పిల్ల ఎంత మురిసిపోతుందో చూడండి అంటూ సామ్ చేసిన కామెంట్ వైరల్ అవుతోంది. తనకు పిల్లలు అంటే ఎంత ఇష్టమనే విషయాన్ని సమంత ఈ పోస్ట్ ద్వారా చెప్పకనే చెప్పేశారు. పిల్లల్ని కనడానికి తాను వ్యతిరేకం కాదని సమంత పరోక్షంగా వివరణ ఇచ్చేశారు. సమంత ప్రస్తుతం యశోద మూవీ షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న యశోద మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. చైతన్య సమంత ప్రస్తుతం వేర్వేరుగా సినిమాలతో బిజీగా ఉన్నారు. వీళ్లిద్దరూ కలిసి ఒకే సినిమాలో నటించడం కష్టమేనని సమాచారం.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus