రష్మిక కాదు ‘పుష్ప’ కి ఫస్ట్ ఛాయిస్ సమంతేనట.. కానీ!

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో ‘పుష్ప’ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ‘మైత్రి మూవీ మేకర్స్’ ‘ముత్యంశెట్టి మీడియా’ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఈ పాటికే మొదలు కావాల్సి ఉంది కానీ.. లాక్ డౌన్ కారణంగా డిలే అవుతూ వస్తుంది. ‘రంగస్థలం’ చిత్రం తరువాత రెండేళ్లు ఖాళీగా ఉంటూ వచ్చాడు సుకుమార్. ఈ కథని రెడీ చేసుకోవడానికి కూడా ఏడాది పైనే టైం తీసుకున్నాడు. ముందుగా మహేష్ తో ఈ సినిమా చెయ్యాలనుకున్నాడు కానీ..

మహేష్ కు ఈ కథ నచ్చలేదని రిజెక్ట్ చేసాడు. తరువాత అల్లు అర్జున్ ఈ స్క్రిప్ట్ ను కొన్ని మార్పులతో యాక్సెప్ట్ చేసాడు. ఇక హీరోయిన్ గా రష్మిక ను ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే నిజానికి.. ‘పుష్ప’ చిత్రంలో హీరోయిన్ గా ముందు రష్మిక ను అనుకోలేదట, సమంతను అనుకున్నారట. ‘రంగస్థలం’ చిత్రంలో సమంత నటనకు ఫ్లాట్ అయిపోయిన దర్శకుడు సుకుమార్.. ‘పుష్ప’ చిత్రంలో కూడా ఆమెనే తీసుకోవాలని అనుకున్నాడట.

ఈ క్రమంలో సమంతను కన్సల్ట్ చేసి ‘పుష్ప’ లో ఆమె పాత్ర గురించి వివరిస్తే.. ‘ఈ పాత్ర ‘రంగస్థలం’ లో రామ లక్ష్మీ పాత్రకు చాలా దగ్గరగా ఉందని.. మళ్ళీ ఇలాంటి పాత్రే చేస్తే.. ప్రేక్షకులు యాక్సెప్ట్ చెయ్యరు’ అని చెప్పి సమంత రిజెక్ట్ చేసిందట. దాంతో సమంత బదులు రష్మికను సుకుమార్ ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది.

Most Recommended Video

మన టాలీవుడ్ డైరెక్టర్లు లేడీ అవతారాలు ఎత్తితే ఇలానే ఉంటారేమో !!
చిరు ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన సినిమాలు ఇవే..!
ఆ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చింది మన రవితేజనే..!
మన హీరోలు అందమైన అమ్మాయిలుగా మారితే ఇలాగే ఉంటారేమో!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus