జనతా గ్యారేజ్ టీజర్ పై స్పందించిన సమంత..!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్నచిత్రం జనతా గ్యారేజ్. ఈ సినిమా మొదలైనప్పటి నుంచే అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. బుధవారం విడుదలైన ఈ చిత్ర టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ వీడియో లోని “బలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి బతకడం ఆనవాయితీ.. బట్ ఫర్ ఏ చేంజ్.. ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది. జనతా గ్యారేజ్.. ఇచట అన్ని రిపేర్లు చేయబడును.” అని తారక్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది.

అంతగా ఆకట్టుకుంది కాబట్టే అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. టీజర్ విడుదలైన కేవలం ఆరు గంటల్లో 10 లక్షల వ్యూస్ మార్క్ ని దాటింది. యూ ట్యూబ్ లో ఇలాంటి ఫీట్ ని చేసిన తొలి తెలుగు చిత్ర టీజర్ ఇదే కావడం విశేషం.  దాంతో జనతా గ్యారేజ్ కథానాయిక సమంత సంబర పడింది. తన ఆనందాన్ని ట్వీట్ రూపంలో తెలిపింది. “ఈ పులి ఇంతలా ఎలా గర్జించింది (దిస్ టైగర్ రోర్స్ అండ్ హౌ)” అని పోస్ట్ చేసింది. తన ఆశ్చర్యాన్ని అభిమానులతో పంచుకుంది. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చేనెల12న రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus