Samantha: ప్రభాస్, బన్నీల గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన సామ్.. ఏం చెప్పారంటే?

  • March 17, 2024 / 07:20 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీని అంతకంతకూ పెంచుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో సమంత తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడిస్తూ కెరీర్ పరంగా మళ్లీ బిజీ అవుతున్నారు. తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న సమంత బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) అంటే తనకు గౌరవమని కామెంట్లు చేశారు. స్టార్ హీరో బన్నీపై (Allu Arjun) క్రష్ ఉందని ఆమె చెప్పుకొచ్చారు. స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) అంటే కూడా ఎంతో గౌరవం అని సమంత వెల్లడించారు.

అల్లు అర్జున్, సమంత కాంబినేషన్ లో సన్నాఫ్ సత్యమూర్తి (S/O Satyamurthy) సినిమా తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. పుష్ప ది రైజ్ (Pushpa) సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. బన్నీ సమంత కాంబినేషన్ హిట్ కాంబినేషన్ కాగా త్వరలో సమంత కెరీర్ పరంగా మరింత బిజీ కానున్నారని సమాచారం అందుతోంది. ప్రభాస్, సమంత కాంబినేషన్ లో మాత్రం ఒక్క సినిమా కూడా తెరకెక్కలేదు.

వేర్వేరు కారణాల వల్ల ఈ కాంబినేషన్ లో సినిమా రాలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నటిగా కెరీర్ ను మొదలుపెట్టి 14 సంవత్సరాలు అయిందని రోజులో ఐదు గంటలు మాత్రమే నిద్రపోయేదాన్ని అని సమంత కామెంట్లు చేశారు. నేను శరీరానికి, మనస్సుకు బ్రేక్ ఇవ్వలేదని సమంత పేర్కొన్నారు.

ఆరోగ్య సమస్యల వల్ల కెరీర్ పరంగా అగ్ర స్థానంలో ఉన్న క్షణాలను ఎంజాయ్ చేయలేకపోయానని ఆమె చెప్పుకొచ్చారు. త్వరలో సమంత నటించిన సిటాడెల్ ఇండియన్ వెర్షన్ రిలీజ్ కు సిద్ధమవుతుండటం గమనార్హం. అమెజాన్ ప్రైమ్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ గురించి క్లారిటీ రావాల్సి ఉంది.

రజాకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

లంబసింగి సినిమా రివ్యూ & రేటింగ్!
సేవ్ ది టైగర్స్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus