అభిమానికి క్షమాపణలు చెప్పిన సమంత

కన్నడలో హిట్ అయిన “యూ టర్న్” చిత్రాన్ని అదేపేరుతో ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. కన్నడ వెర్షన్ కి దర్శకత్వం వహించిన పవన్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో సమంత జర్నలిస్ట్ గా లీడ్ రోల్ చేసింది. అలాగే భూమిక, అది పినిశెట్టి , రాహుల్ రవీంద్రన్ తదితరులు నటించిన ఈ మూవీ ట్రైలర్ నిన్న(శుక్రవారం) రిలీజ్ అయి విశేషంగా ఆకట్టుకుంటోంది. 24 గంటలు కూడా పూర్తికాకముందే 2 మిలియన్ వ్యూస్ దిశగా దూసుకుపోతోంది. ఇందులో సమంత సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. ఆమె గొంతు కొంతమందికి నచ్చుతుంటే మరికొంతమందికి నచ్చడం లేదు.

ఆ విషయాన్ని ఓ అభిమాని ట్విట్టర్ వేదికపై నిర్మొహమాటంగా చెప్పారు. ”యూ టర్న్ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశిస్తున్నా. సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ డబ్బింగ్‌కు కూడా మంచి రివ్యూస్ వస్తాయని భావిస్తున్నా. యూ టర్న్ డబ్బింగ్ విషయంలో జాగ్రత్త తీసుకోండి” అని ట్వీట్ చేశారు. దీనికి సమంత పాజిటివ్ గా స్పందించింది. ”డబ్బింగ్‌ను సరి చేస్తున్నాం. దానికి సారీ” అని చెప్పింది. అభిమాని వేలెత్తి చూపిస్తే.. సమర్ధించుకోవడానికి ప్రయత్నించకుండా.. సరిచేసుకుంటానని చెప్పడంతో సమంతపై అభినందనలు వెల్లువెత్తాయి. అలా తనను తాను నిత్యా విద్యార్థిగా భావిస్తూ.. ప్రతి విషయంలో మెరుగవుతూ వస్తోంది కాబట్టి ఆమెంటే దర్శకనిర్మాతలకు ఇష్టమని సినీ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus