కొత్త సినిమా విశేషాలను చెప్పిన సమంత

అక్కినేని వారి కోడలు సమంత నటించిన రంగస్థలం సినిమా టీజర్ నేడు రిలీజ్ అయి సంచలనం సృష్టించింది. ఈ వీడియో యూట్యూబ్ లో 50 నిముషాల్లో వన్ మిలియన్ వ్యూస్ అందుకొని చిత్ర బృందాన్ని ఆనందింపజేసింది. సమంత నటించిన మరో రెండు సినిమాలు ఈ ఏడాది ప్రధమార్ధంలోనే రిలీజ్ కానున్నాయి. అలనాటి నటి జమునగా సమంత నటించిన మహానటి మూవీ మార్చి 29 న రిలీజ్ కానుంది. అలాగే చెర్రీకి జోడీగా నటించిన రంగస్థలం మార్చి 30 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వాటన్నింటికంటే సమంతను సంతోషపెట్టే మరో విశేషం ఏమిటంటే తన డ్రీమ్ ప్రాజక్ట్ మొదలు కావడం. సమంత ఎప్పటి నుంచో లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో నిరూపించుకోవాలని కలలు కనింది.

మంచి కథ కోసం ఎదురుచూసింది. కన్నడలో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్న “యూ టర్న్‌” కథ ఆమెను ఆకర్షించింది. దానిని తెలుగులో చేయడానికి అనేక ప్రయత్నాలు చేసింది. చివరికి విజయం సాధించింది. ఈ సినిమాను తెలుగు, తమిళంలో రీమేక్‌ చేయనున్నారు. ఇందులో సమంత హీరోయిన్ గా నటించనుంది. ఈ విషయాన్ని సమంత ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. ఫిబ్రవరిలో షూటింగ్‌ మొదలుకాబోతున్నట్లు తెలిపింది. ‘2018 ఎవ్రీథింగ్‌ ఐ వాంట్‌. ఫిబ్రవరిలో షూటింగ్‌ మొదలుకాబోతోంది. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు’ అని సమంత ట్వీట్‌ చేసింది. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై నిర్మితం కానున్న ఈ మూవీని పవన్‌ కుమార్‌ దర్శకత్వం వహించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus