వైరల్ అవుతోన్న సమంత వెయిట్ లిఫ్టింగ్ వీడియో..!

సమంత ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్. తెలుగులో అయితే దాదాపు లేడీ సూపర్ స్టార్ అనిపించుకుంటూ దూసుకుపోతుంది. చైతూ తో పెళ్ళైన తర్వాత గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ.. కేవలం తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్నే చేస్తూ.. తన క్రేజ్ ను మరింత పెంచుకుంటుంది. అంతేకాదు ఆమె నటించే సినిమాలన్నీ వరుసగా హిట్ అవుతూ ఉండడం కూడా ఈమెకు బాగా కలిసొస్తుంది. ఈ ఏడాది విడుదలైన ’96’ రిమేక్ ‘జాను’ కి కూడా మంచి రివ్యూలు వచ్చాయి. కానీ అన్ సీజన్ కావడం.. ఇప్పటికే ’96’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు కూడా చాలా వరకూ చూసెయ్యడంతో కలెక్షన్స్ మాత్రం రాలేదు. అయితే సామ్ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

ఇదిలా ఉండగా.. 3 పదుల వయసు దాటినా.. ఈ బ్యూటీ ఇప్పటికీ అదే గ్లామర్ ను ఫిజిక్ ను మెయింటైన్ చేస్తూ వస్తుంది. దీని వెనుక కారణం ఏంటి అని కొంత మంది కామెంట్స్ చేస్తున్నా కానీ.. సినిమా హీరో, హీరోయిన్లు వర్కౌట్ లు చేస్తారన్న సంగతి తెలీదా అంటూ మరికొందరు వారికి సమాధానాలు ఇస్తున్నారు.. సోషల్ మీడియాలో. అయితే పెళ్ళైన తర్వాత కొన్ని బాధ్యతలు పెరుగుతాయి కాబట్టి.. అలా వర్కౌట్ లు చేసే ఛాన్స్ ఉంటుందా అనే అనుమానాలు మాత్రం అందరిలోనూ ఉన్నాయి. దానికి సమంత ఎప్పటికప్పుడు తన జిమ్ వీడియోలతో సమాధానం చెబుతూనే ఉంది. ఇప్పుడు మరోసారి 100 కేజీల వెయిట్ లిప్ట్ చేస్తూ ఉన్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. ‘ఫ్యామిలీ మెన్’ సీజన్ వెబ్ సిరీస్ లో యాక్షన్ ఎపిసోడ్స్ కోసం సమంత ఇలా కష్టపడుతుందట. ఆ వెబ్ సిరీస్ లో సమంత యాక్షన్ యాంగిల్ కూడా చూడొచ్చు అన్న మాట.

Most Recommended Video


పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!
ఓ పిట్టకథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus