ఆ నిర్మాతకు చుక్కలు చూపించిన సమంత.. ఏం జరిగిందంటే?

స్టార్ హీరోయిన్ సమంత నటించిన యశోద సినిమా హిట్ గా నిలిచినా శాకుంతలం సినిమా మాత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఈ సినిమాకు 70 కోట్ల రూపాయలు ఖర్చు కాగా ఆ బడ్జెట్ లో పదో వంతు కూడా కలెక్షన్లు రాలేదనే సంగతి తెలిసిందే. శాకుంతలం సినిమా ఫ్లాప్ కావడంతో సమంతపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ప్రముఖ నటుడు, నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు సమంతది ముసలి ముఖం అంటూ కామెంట్ చేశారు.

సమంత కెరీర్ ముగిసిపోయిందనే విధంగా త్రిపురనేని చిట్టిబాబు కామెంట్లు చేయడం గమనార్హం. ఈ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ కాగా సమంత అభిమానులు ఈ నిర్మాతపై ఫైర్ కావడం జరిగింది. అయితే ఈ నిర్మాత, నటుడి పేరు ప్రస్తావించకుండానే సమంత ఈ వ్యక్తికి చుక్కలు చూపించారు. ఈ నిర్మాతకు చెవుల నుంచి కూడా జుట్టు బయటకు కనిపిస్తుందనే సంగతి తెలిసిందే.

ఇఫ్ యు నో యు నో అంటూ సమంత టెస్టోస్టిరాన్ ఎక్కువగా ఉత్పత్తి అయితే ఆ విధంగా జుట్టు బయటకు వస్తుందని చెప్పుకొచ్చారు. అయితే సమంత ఈ పోస్ట్ షేర్ చేసినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా సామ్ ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఈ పోస్ట్ కనిపించడం లేదు. శాకుంతలం రిజల్ట్ ను పట్టించుకోకుండానే సమంత కెరీర్ పరంగా ముందడుగులు వేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

ఖుషి, సిటాడెల్ ప్రాజెక్ట్ లతో సమంత కోరుకున్న విజయాలు దక్కడం గ్యారంటీ అని ఇందుకు సంబంధించి సందేహాలు అవసరం లేదని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఒక్క ఫ్లాప్ సమంత మార్కెట్ ను తగ్గించదని సినిమా ఫ్లాప్ కావడానికి వేర్వేరు కారణాలు ఉంటాయని వాళ్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సమంతను అనవసరంగా టార్గెట్ చేయొద్దని నెటిజన్లు చెబుతున్నారు. కెరీర్ విషయంలో సమంత ఆచితూచి జాగ్రత్తగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే.

 

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus