Samantha, Naga Chaitanya: ఇలాంటి ట్రోలింగ్ కి భయపడను : సమంత స్టైలిస్ట్

టాలీవుడ్ స్టార్ కపుల్ నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ విడిపోతున్నట్లు అనౌన్స్ చేశారే తప్ప.. దానికి గల కారణాలను మాత్రం చెప్పలేదు. దీంతో సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో సమంత పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ పై నెటిజన్లు ట్రోలింగ్ కి పాల్పడ్డారు. చైతు-సమంత విడిపోవడానికి ప్రీతమ్ కారణమంటూ విమర్శలు చేశారు. ఈ ఇష్యూపై తాజాగా ప్రీతమ్ స్పందించాడు.

తను సమంతను ‘అక్క’ అని పిలుస్తాననే సంగతి చాలా మందికి తెలుసని.. అలాంటిది తమ మధ్య ఎఫైర్ ఉందని తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారని చెప్పారు. ‘ఐలవ్యూ’ అని సోషల్ మీడియాలో ఎందుకు కామెంట్ చేశావని చాలా మంది అడుగుతున్నారని.. కుటుంసభ్యులకు, సోదరిగా భావించే వారికి ‘ఐలవ్యూ’ చెప్పడంలో తప్పేముందని ప్రశ్నించాడు. ఎంతోమంది తనను తిడుతూ మెసేజ్ లు చేస్తున్నారని.. ఇంటి నుంచి బయటకు వస్తే చంపేస్తామని హెచ్చరిస్తున్నారని చెప్పుకొచ్చాడు. నాగచైతన్య తనకు చాలా ఏళ్లుగా తెలుసని చెప్పిన ప్రీతమ్..

సమంతతో తనకున్న బంధం గురించి చైతుకి స్పష్టం తెలుసని అన్నారు. తనకు, సమంతకు ఎఫైర్ ఉందని వస్తున్న కామెంట్స్ పై నాగచైతన్య స్పందించకపోవడం బాధగా ఉందని ప్రీతమ్ చెప్పాడు. ఆయన ఒక్క స్టేట్మెంట్ ఇస్తే.. అసలు ఈ పరిస్థితి రాదని అన్నాడు. ప్రస్తుతం సమంత ఎంతో బాధలో ఉందని.. ఇలాంటి సమయంలో ఆమెకి కచ్చితంగా మద్దతుగా ఉంటానని.. ఇలాంటి ట్రోలింగ్ కి భయపడనని చెప్పుకొచ్చాడు ప్రీతమ్.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus