Samantha: చాలా రోజుల తర్వాత తల్లితో కనిపించిన సమంత!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొద్ది రోజులుగా వరుస సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. గత కొద్దిరోజులుగా ఈమె సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ తో పాటు ఖుషి సినిమా షూటింగ్ పనులలో భాగంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇలా ఏమాత్రం తీరికలేకుండా వరుస షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నటువంటి సమంత తన సినిమా షూటింగ్ పనులకు కాస్త బ్రేక్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే సమంత షూటింగ్ సమయంలో కాస్త విరామం దొరకడంతో తన తల్లితో కలిసి సరదాగా డిన్నర్ నైట్ కి వెళ్లి చిల్ అయ్యారు.

ప్రస్తుతం సమంత రెస్టారెంట్ లో తన తల్లితో కలిసి ఉన్నటువంటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇలా చాలా రోజుల తర్వాత సమంత తన తల్లితో కలిసి కనిపించడంతో ఈ ఫోటో వైరల్ అవుతుంది. ఇక సమంత తల్లి సమంత నాగచైతన్య ఇద్దరు విడాకులు తీసుకున్న సమయం నుంచి సమంత మధ్య ఉంటున్నారని తనతోనే కలిసి నివసిస్తున్నారనే విషయం మనకు తెలిసిందే.

ఇక సమంత తాజాగా నటించిన శాకుంతలం సినిమా పెద్దగా ప్రేక్షకు ఆదరణ నోచుకోలేకపోయింది ఇక ఈమె నటిస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రాబోతున్న ఖుషి సినిమా కూడా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా (Samantha) సమంత అనారోగ్య సమస్యల కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.అయితే ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీ విడుదల కాబోతోంది. ప్రస్తుతం సమంత తన సినిమా షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus