Samantha: సమంత కోసం నాగచైతన్య దేవదాసులా చూడాలా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ కపుల్ గా ఉన్నటువంటి చైతన్య సమంత జంటకు ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. దాదాపు కొన్ని సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. నాలుగు సంవత్సరాలపాటు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్న సమంత నాగ చైతన్య చివరికి గత ఏడాది విడాకులు తీసుకుని విడిపోయారు. వీరు విడాకులకు గల కారణం ఏమిటి అనే విషయం గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

విడాకుల తర్వాత సమంత పూర్తిగా తన కెరీర్ పై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే విడాకుల తర్వాత సమంత కాస్త గ్లామర్ షోకి కూడా తెరతీసింది.ఈ క్రమంలోనే ఎన్నో బోల్డ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇలా ఈమె గ్లామర్ షో చేయడంతో సమంత గురించి పెద్ద ఎత్తున నెగిటివ్ కామెంట్లు కూడా వెల్లువెత్తాయి.ఇకపోతే తాజాగా నాగచైతన్య మరొక హీరోయిన్ తో ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ పెద్దఎత్తున వార్తలు షికార్లు చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఈ వార్తలపై అక్కినేని ఫ్యాన్స్ స్పందిస్తూ తమ అభిమాన నటుడు మరోసారి పెళ్లి చేసుకోబోతున్నారని తెలియడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరికొంతమంది ఫాన్స్ సమంతను భారీగా ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ హద్దుమీరి సమంత పై దారుణమైన కామెంట్ చేశారు. సమంత ఒక వేశ్య.. బట్టలు విప్పుకొని బజార్ లో తిరగమని చెప్పు.. ఇలాంటి దాని కోసం చైతన్య దేవదాసులా వెయిట్ చేయాలా? అంటూ ట్వీట్ చేశారు.

ఇక ఈ నెటిజెన్ చేసిన ట్వీట్ పై సమంత స్పందిస్తూ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. నిజంగా భయపడాలి అంటూ రెండు స్మైలీ ఎమోజీలను షేర్ చేస్తూ పరోక్షంగా తాను ఎవరికీ భయపడేది లేదు అంటూ చెప్పకనే సమాధానం చెప్పారు. మొత్తానికి నెటిజన్ సమంతను ఉద్దేశిస్తూ ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే సమంత ఇలాంటి కామెంట్లు ఏమాత్రం లెక్కచేయకుండా పూర్తిగా తన కెరీర్ పై దృష్టి పెట్టి వరుస సినిమాలతో దూసుకుపోతోంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus