Nagarjuna: చైసామ్ విడాకుల పై ఓపెన్ అయిన నాగార్జున..!

2017 లో ప్రేమ వివాహం చేసుకున్న నాగ చైతన్య, సమంతలు…నాలుగేళ్ళ పాటు హ్యాపీగా కలిసి కాపురం చేసి ఎవ్వరూ ఊహించని విధంగా 2021 అక్టోబర్ 2న విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. దీంతో ‘చైసామ్’ జంటని అభిమానించే వారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ వార్త ముందు నుండీ బయటకి వచ్చినప్పటికీ ఆ వార్తల్ని జనాలు జీర్ణించుకోలేకపోయారు. ఇవి అబద్దం అయితే బాగుణ్ణు అని చైసామ్ అభిమానులు కోరుకున్నారు. దానికి తోడు పలుసార్లు ఇది అబద్దమన్నట్టు చైతన్య, సమంత లు రియాక్ట్ అవ్వడంతో ఫ్యాన్స్ కొంత మేర ఊపిరి పీల్చుకునే ప్రయత్నం చేశారు.

అయినా వారికి షాక్ తప్పలేదు..! అక్టోబర్ 2న అది గట్టిగా తగిలింది. చైసామ్ విడాకులు ప్రకటించగానే.. చైతన్య అభిమానులు సమంతని ఓ రేంజ్లో ట్రోల్ చేశారు. ఇప్పటికీ ఆ ట్రోలింగ్ కొంత మేర జరుగుతూనే ఉంది. ఇదిలా ఉండగా.. విడాకులు అయిన ఇన్ని నెలలకి నాగ చైతన్య తండ్రి నాగార్జున మొదటి సారి ఈ విషయం పై స్పందించాడు.’ సమంతే మొదట విడాకులు కావాలని కోరిందని… ఆమె నిర్ణయాన్ని గౌరవించి అడ్డుచెప్పాలని అనుకోలేదు.

ఇద్దరూ ఎంతో ప్రేమగా ఉండేవారు.2021 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా ఎంతో ఆనందంగా జరుపుకున్నారు. సమంత విడాకుల నిర్ణయం ఎందుకు తీసుకుంది? అందుకు కారణాలు ఏంటి? అన్నది నాకు తెలీదు.విడాకుల విషయంలో పరువు, మర్యాద ల గురించే చైతన్య ఎక్కువగా ఆలోచించాడు.’ అంటూ చెప్పుకొచ్చాడు నాగార్జున.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus