Samantha: పుష్ప స్పెషల్ సాంగ్ ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలుసా?

అల్లు అర్జున్ ను పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు తెచ్చి పెట్టిన చిత్రం పుష్ప.సుకుమార్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఊహించని విధంగా సంచలనమైన విజయం అందుకుంది. ఇలా ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ సైతం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ షూటింగ్ పనులలో చిత్ర బృందం ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక నటించగా స్పెషల్ సాంగ్ లో మాత్రం (Samantha) సమంత నటించి సందడి చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలోని ఉ అంటావా మామ అనే పాటలో సమంత ఎంతో అద్భుతంగా నటించడంతో ఈమె కూడా పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇప్పటికీ ఈ పాట ట్రెండ్ అవుతూనే ఉంది.అయితే తాజాగా ఈ పాట గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పుష్ప సినిమాలోని ఈ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేసిన తర్వాత ఇందులో స్టార్ హీరోయిన్ తో చేయాలని సుకుమార్ ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే ముందుగా ఈయన తమన్నాని కలిసారట.అప్పటికే తమన్న పలు సినిమాలలో స్పెషల్ సాంగ్స్ ద్వారా సందడి చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సుకుమార్ తమన్నని అప్రోచ్ అవ్వగా ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ గురించి చెప్పడంతో ఆమె మాత్రం ఈ పాటను రిజెక్ట్ చేశారు.

అప్పటికే తమన్న పలు సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న కారణంతో ఈ స్పెషల్ సాంగ్ చేయటానికి వీలు లేకుండా పోయింది. మరి ఈ స్పెషల్ సాంగ్ చేయడానికి ఎవరైతే బాగుంటారో అని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో అల్లు అర్జున్ సమంత పేరు చెప్పారట. అప్పుడే విడాకులు తీసుకున్నటువంటి సమంతను స్పెషల్ సాంగ్ చేయమని అడిగితే ఒప్పుకుంటారా అన్న సందేహం సుకుమార్ కి రావడంతో స్వయంగా అల్లు అర్జున్ సమంతకు ఫోన్ చేసి ఈ పాటలో నటించాలని తనని ఒప్పించారట. అలా పుష్ప స్పెషల్ సాంగ్ లో సమంత నటించారు. లేకపోతే ఈ పాటలో తమన్నా సందడి చేసేవారని తెలుస్తుంది.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus