Akhil: అఖిల్ కి స్పెషల్ గా బర్త్ డే విషెస్ చెప్పిన సమంత..!

సమంత .. అక్కినేని నాగచైతన్య ని 2017 లో వివాహం చేసుకుంది. వీరిది ప్రేమ వివాహం. అయితే 2021 లో ఎవ్వరూ ఊహించని విధంగా ఈ జంట విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. అది ఇప్పటికీ పెద్ద మిస్టరీనే..! దీనికి కారణం ఏంటి.. అనేది ఎవ్వరికీ తెలీదు. ‘ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో బోల్డ్ సన్నివేశాల్లో సమంత నటించడం.. అక్కినేని కుటుంబానికి ఇష్టంలేక.. ఆమెను మందలిస్తే.. తన స్వేచ్ఛని అడ్డుకుంటున్నారు అని భావించి సమంత విడాకులు తీసుకోవడానికి రెడీ అయినట్టు అప్పట్లో అనుకున్నారు.

ఇప్పటికీ అదే అనుకుంటున్నారు. అంతకు మించి ఈ విషయం గురించి ఎవ్వరికీ ఏమీ తెలీదు. అయితే బాలీవుడ్ మీడియాతో సమంత ఈ విషయం పై స్పందించి అసలు విషయం చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. అది ఏంటి అన్నది ఇంకా బయటకు రాలేదు..! ఇదిలా ఉండగా.. నాగార్జున, నాగ చైతన్య లతో సమంత చాలా దూరం మెయింటైన్ చేస్తుంది. కానీ దగ్గుబాటి ఫ్యామిలీతో అలాగే అఖిల్ అక్కినేనితో ఇంకా సన్నిహితంగానే ఉంటున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

విడాకుల ప్రకటించాక నాగ చైతన్యకి సమంత .. ఇప్పటివరకు బర్త్ డే విషెస్ చెప్పింది లేదు.నాగ చైతన్య సినిమాల విషయంలో కూడా అంతే..!కానీ అఖిల్ (Akhil) పుట్టినరోజు నాడు మాత్రం సమంత స్పెషల్‌గా పోస్ట్ వేస్తూ ఉంటుంది. అఖిల్ ‘ఏజెంట్’ సినిమా పై కూడా స్పందిస్తూ తాజాగా ఆమె ఇన్స్టాలో స్టోరీ పెట్టింది. అలా అని అఖిల్ మాత్రం సమంతకి రిప్లై ఇవ్వడు.

బహుశా పర్సనల్ గా థాంక్యూ మెసేజ్ పెడతాడేమో కానీ.. పబ్లిక్ గా బయటపడడు. అయితే సమంతని అఖిల్ ఇప్పటికీ ‘వదినమ్మ’ అనే పిలుస్తుంటాడు అని ఇన్సైడ్ టాక్. అందుకే మరిది అంటే సమంతకి ప్రత్యేక అభిమానం అని స్పష్టమవుతుంది.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus