Samantha: సిద్దూ తో సమంత ఓకే అనడానికి కారణం అదేనా?

  • May 18, 2023 / 07:26 PM IST

సిద్దు జొన్నలగడ్డ డిజె టిల్లు సినిమాతో టాలీవుడ్ లో ఒక్కసారిగా క్రేజీ హీరోగా మారిపోయాడు.. ఈ సినిమా కన్నా ముందు పలు సినిమాల్లో నటించిన సిద్దు.. అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. డీజే టిల్లు సినిమాతో ఒకసారిగా స్టార్ హీరో రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం డిజే టిల్లు సీక్వెల్ లో నటిస్తున్నాడు. ఇక ఎలాంటి పాత్రలోనైనా అద్భుతంగా నటించగలదు సమంత. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ఓ వార్త సోషల్‌మీడియాలో వైరలవుతోంది.

త్వరలోనే సమంత ‘ఖుషి’ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత సామ్‌ ఈ యంగ్‌ హీరో సినిమాలో నటించనుందని అంటున్నారు. నందినీ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుందట. గతంలో నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత రెండు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఇక వీళ్లిద్దరి హ్యాట్రిక్‌ మూవీగా ఇది రానుందని టాక్‌ వినిపిస్తోంది. అందులో సిద్దూ జొన్నలగడ్డ హీరోగా నటించనున్నారని ప్రచారం జరుగుతోంది.

పూర్తి స్థాయి కామెడీ చిత్రంగా ఇది రానున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు కానీ.. వార్త మాత్రం నెట్టింట తెగ షేర్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. వీరిద్దరు స్క్రీన్‌ పంచుకుంటే కావలసినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుందంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సమంత కూడా ప్రస్తుతం తన కెరీర్‌లో వరుస అపజయాలను మూట కొట్టుకుంటుంది. దీంతో ఎలాంటి సినిమాకైనా సమంత ఓకే చెప్పేస్తుంది.

ఒక‌ప్పుడు వ‌రుస‌గా స్టార్ హీరోల‌కు జోడీగా న‌టించిన (Samantha) ఆమె ఇప్ప‌టికే విజ‌య్ దేవ‌ర‌కొండ తో ఖుషి చేస్తోంది. ఇక ఇప్పుడు సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌కు కూడా ఓకే చెప్పేసింది. మ‌రీ సమంత ఈ స్థాయిలో దిగజారి పోయింద‌ని ఇండ‌స్ట్రీ జ‌నాలు చెవులు కొరుక్కుంటున్నారు. తాజాగా వచ్చిన శకుంతలం సినిమాతో భారీ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకుని తన కెరీర్ ను పాతాళానికి నెట్టేసుకుంది. ఇక మరి సమంత సిద్దు సినిమాతో అయినా హిట్ అందుకుంటారో లేదో చూడాలి.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus