యాక్షన్ హీరో విశాల్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ డ్రామా ‘సామాన్యుడు’. ‘నాట్ ఏ కామన్ మ్యాన్’ అనేది దీని క్యాప్షన్. నూతన దర్శకుడు తు.పా.శరవణన్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని విశాల్ తన సొంత బ్యానర్ అయిన ‘విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ’ (VFF) పై నిర్మించాడు. ఫిబ్రవరి 4న విడుదలైన ఈ చిత్రం యావరేజ్ టాక్ ను సంపాదించుకుంది.కానీ కలెక్షన్ల పరంగా పూర్తిగా నిరాశపరిచింది.వీకెండ్ వరకు కొంత ఓకె అనిపించినా.. వీకెండ్ తర్వాత చేతులెత్తేసింది.
ఒకసారి క్లోజింగ్ కలెక్షన్లను గమనిస్తే :
నైజాం | 0.45 cr |
సీడెడ్ | 0.36 cr |
ఉత్తరాంధ్ర | 0.27 cr |
ఈస్ట్ | 0.21 cr |
వెస్ట్ | 0.13 cr |
గుంటూరు | 0.19 cr |
కృష్ణా | 0.15 cr |
నెల్లూరు | 0.12 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 1.87 cr |
‘సామాన్యుడు’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.4.6 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు ఈ చిత్రం రూ.4.8 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం కేవలం రూ.1.87 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. అంటే బయ్యర్స్ కు రూ.2.73 కోట్ల నష్టాలను మిగిల్చింది. 50 శాతం కూడా రికవరీ సాధించలేదు కాబట్టి ఈ చిత్రాన్ని డబుల్ డిజాస్టర్ గా పరిగణించాలి.
ఈ మధ్య కాలంలో విశాల్ సినిమాలు తెలుగులో మంచి టాక్ ను సంపాదించుకుంటున్నప్పటికీ బ్రేక్ ఈవెన్ సాధించలేకపోతున్నాయి. పైగా ఫిబ్రవరి, నవంబర్ వంటి అన్ సీజన్లోనే విశాల్ సినిమాలు రిలీజ్ అవ్వడం మరో మైనస్ పాయింట్ గా చెప్పుకోవాలి.
Most Recommended Video
ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!