కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి..తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.అతను హీరోగా తెరకెక్కిన ‘అతడే శ్రీమన్నారాయణ’ ‘ఛార్లీ’ చిత్రాలు తెలుగులో కూడా బాగా ఆడాయి. దీంతో అతను నటించిన ‘సప్త సాగరాలు దాటి’ అనే చిత్రాన్ని తెలుగులో కూడా రిలీజ్ చేశారు. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ వంటి బడా సంస్థ ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. కన్నడలో అయితే సెప్టెంబర్ 1 నే రిలీజ్ అయ్యింది.
తెలుగులో ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. రివ్యూస్ కూడా చాలా పాజిటివ్ గా వచ్చాయి.క్లైమాక్స్ కి అందరూ ఇంప్రెస్ అయ్యారు. కానీ ఇది బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. ఇది క్లాస్ బొమ్మ అని.. పక్కాగా మల్టీప్లెక్సుల్లో బాగా ఆడుతుంది అని అన్నారు. కానీ మల్టీప్లెక్సుల్లో అదీ రిలీజ్ రోజునే చాలా చోట్ల షోలు క్యాన్సిల్ అయ్యాయి. రెండో రోజుకే ఈ సినిమా స్క్రీన్స్ తగ్గిపోయాయి అని చెప్పాలి.
దీనికి కారణం ఏంటని.. నిర్మాతలలో ఒకరైన వివేక్ కూచిభొట్లని అడగ్గా, ఆయన.. ‘రిలీజ్ కి ముందు పబ్లిసిటీ చేయలేదు కదా.. అందుకే సరిగ్గా కలెక్ట్ చేయలేదు’ అని చెప్పారు. కానీ ఈ సినిమా సెకండ్ పార్ట్ అయిన ‘సప్త సాగరాలు దాటి : సైడ్ బి’ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఈ సినిమాని (Sapta Sagaralu Dhaati) కూడా ‘పీపుల్ మీడియా సంస్థ’ పెద్దగా ప్రమోట్ చేయడం లేదు.
నవంబర్ 17 నే ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఆ రోజు ‘మంగళవారం’ వంటి ఎన్నో క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అలాంటప్పుడు ప్రమోషన్ సరిగ్గా చేయకపోవడం.. మళ్ళీ అదే తప్పు చేస్తున్నట్టు అంటూ అంతా అభిప్రాయ పడుతున్నారు.