ఇదివరకూ స్టార్ డమ్ అంటే ఎన్ని సినిమాలు చేశారు, ఎన్ని భాషల్లో నటించారు, ఎన్ని హిట్స్ ఉన్నాయి వంటి వాటిని బేరీజు వేసుకొని చేసేవారు. కానీ.. ఇప్పుడు స్టార్ డమ్ అంటే సినిమా మొదటిరోజు కలెక్షన్స్ ను బట్టి స్టార్ డమ్ డిసైడ్ అవుతుంది. అభిమానులు ఉండడం వేరు.. వాళ్ళు టికెట్లు కొని థియేటర్లకు రావడం వేరు.. అనే విషయం ఎప్పటికప్పుడు తేటతెల్లమవుతూనే ఉన్నప్పటికీ.. ఈమధ్యకాలంలో రిలీజైన సినిమాలు కొందరు హీరోల స్టార్ డమ్ కు ప్రతీకగా నిలిచాయి. భారీ అంచనాల నడుమ విడుదలైన “డిస్కో రాజా” కనీస స్థాయి ఓపెనింగ్స్ మాత్రమే కాక కలెక్షన్స్ కూడా రాబట్టలేక డిజాస్టర్ గా నిలిచింది. అనంతరం విడుదలైన “జాను” పరిస్థితి కూడా అంతే. ఇక మొన్న విడుదలైన విజయ్ దేవరకొండ పరిస్థితి కూడా ఇంచుమించిగా అంతే.
రవితేజ, శర్వానంద్, విజయ్ దేవరకొండ.. ఇలా ఈ స్టార్ హీరోలందరి పరిస్థితి ఒకటే. ఫ్యాన్స్ ఉన్నారు, ఫ్యాన్ బేస్ ఉంది. కానీ సినిమాకి కనీస స్థాయి కలెక్షన్స్ రావడం లేదు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి హీరోలు రిజల్ట్ తో సంబంధం లేని ఓపెనింగ్స్ తో తమ స్టామినాను ఎప్పటికప్పుడు ఘనంగా చాటుకొంటుండగా.. మిగతా హీరోలు మాత్రం స్టార్ డమ్ ను టికెట్లుగా ఎలా మలుచుకోవాలో తెలియక కొట్టిమిట్టాడుతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో రెండు సినిమాల తర్వాత వీళ్ళు స్టార్ హీరోస్ అనే విషయాన్ని జనాలు మర్చిపోతారు.
Most Recommended Video
వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రివ్యూ & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా రివ్యూ & రేటింగ్!