ఒకే టైటిల్ తో మరో సినిమా రావడం కొత్తేమి కాదు.క్రేజ్ కోసం గతంలో హిట్టైన సినిమా టైటిల్ ను వాడుకుంటూ ఉంటారు. పవన్ కళ్యాణ్- కరుణాకరణ్ ల ‘తొలిప్రేమ’ టైటిల్ ను వరుణ్ తేజ్-వెంకీ అట్లూరి కాంబినేషన్లో వచ్చిన సినిమాకి పెట్టుకున్నారు.చిరంజీవి ‘గ్యాంగ్ లీడర్’ సినిమాని నాని-విక్రమ్ కుమార్ లు ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ గా వాడుకున్నారు. అంతకు ముందు నాగార్జున ‘మజ్ను’ టైటిల్ ను కూడా వాడుకున్నాడు నాని. ఇలా టైటిల్ తో ఆడియెన్స్ అటెన్షన్ ను డ్రా చేయడానికి పాత సూపర్ హిట్ సినిమాల టైటిల్స్ ను వాడుకుంటూ ఉంటారు.
అయితే ఆ టైటిల్ ను వాడుకోవాలి అంటే 10 ఏళ్ళు గ్యాప్ ఉండాలి.ఇక అసలు విషయానికి వస్తే.. గతంలో కథ డిమాండ్ చేయడం వలన ముగ్గురు స్టార్ హీరోల ఒకే టైటిల్ ను వాడుకోవాల్సి వచ్చింది. అవి మూడు కూడా ప్రేమ కథలే కావడం మరో విశేషం. వివరాల్లోకి వెళితే.. అక్కినేని నాగేశ్వర రావు హీరోగా 1962 వ సంవత్సరంలో వి.మధుసూధన రావు దర్శకత్వంలో ‘ఆరాధన’ అనే సినిమా వచ్చింది. సావిత్రిగారు హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం యావరేజ్ గా ఆడింది. అటు తర్వాత 1976 వ సంవత్సరంలో సీనియర్ ఎన్టీఆర్ హీరోగా బి.వి.ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీకి కూడా ‘ఆరాధన’ టైటిల్ ను వాడుకున్నారు.
‘నా మది నిన్ను పిలిచింది గానమై’ పాట ఈ సినిమాలోనిదే. వాణిశ్రీ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం మంచి ఫలితాన్నే అందుకుంది. ఇక 1987 వ సంవత్సరంలో చిరంజీవి హీరోగా భారతీరాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాకి కూడా ‘ఆరాధన’ టైటిల్ ను పెట్టుకున్నారు. ‘అరె ఏమైంది.. ఒక మనసుకి రెక్కలొచ్చి’ అనే సూపర్ హిట్ సాంగ్ ఈ సినిమాలోనిదే. రాధిక,సుహాసిని హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ప్లాప్ అయ్యింది. ఇలా ఒకే టైటిల్ తో వచ్చిన ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు ఒకటి యావరేజ్, ఒకటి హిట్ చివరిది ప్లాప్ గా మిగిలింది.