Sameera Reddy: అలాంటి ఇబ్బందులు అనుభవించానన్న సమీరారెడ్డి.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్, బాలీవుడ్, ఇతర ఇండస్ట్రీలలో మంచి పేరును సొంతం చేసుకున్న హీరోయిన్లలో సమీరారెడ్డి ఒకరు. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక స్టార్ హీరోతో ప్రేమాయణం ద్వారా చాలా సంవత్సరాల క్రితం సమీరా రెడ్డి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న సమీరా రెడ్డి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను వేర్వేరు సందర్భాల్లో వెల్లడిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. సమీరా రెడ్డి మాట్లాడుతూ కూరగాయలు అమ్మే వ్యక్తి కూడా నాతో మాట్లాడుతూ నా శరీరంపై కామెంట్ చేశాడని ఆమె అన్నారు.

2014 సంవత్సరంలో అక్షయ్ తో నాకు పెళ్లి జరిగిందని మా ఇంటి టెర్రస్ పై సింపుల్ గా పెళ్లి చేసుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు. నేను పెళ్లి చేసుకున్న సమయంలో గర్భవతిని కావడం వల్లే నేను పెళ్లి చేసుకున్నానని చాలామంది ప్రచారం చేశారని సమీరారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. వైరల్ అయిన ఆ కామెంట్లలో ఏ మాత్రం నిజం లేదని ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో నా పెళ్లి జరిగిందని సమీరా రెడ్డి అన్నారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ సమయంలో నాకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయని ఆమె చెప్పుకొచ్చారు.

2015 సంవత్సరంలో బాబు పుట్టిన తర్వాత నేను బరువు పెరిగానని (Sameera Reddy) సమీరారెడ్డి కామెంట్లు చేశారు. నా శరీరాకృతి విషయంలో చుట్టుపక్కల వాళ్ల నుంచి నెగిటివ్ కామెంట్లు వచ్చాయని ఆమె అన్నారు. కూరగాయలు అమ్మే వ్యక్తి సైతం నాతో మాట్లాడుతూ దీదీ ఏమైంది? ఇది మీరేనా? అని అన్నాడని సమీరా రెడ్డి చెప్పుకొచ్చారు.

ఆ కామెంట్లు నన్ను ఎంతగానో బాధ పెట్టాయని ఆమె వెల్లడించారు. ఫోటోగ్రాఫర్లకు కనిపించకూడదనే ఉద్దేశంతో కొంతకాలం బయటకు కూడా వెళ్లలేదని సమీరారెడ్డి అన్నారు. సమీరారెడ్డి వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. సమీరా రెడ్డి కెరీర్ పరంగా మళ్లీ బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus