‘రాజావారు రాణి గారు’, ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ వంటి విజయవంతమైన చిత్రాలతో యువతకి చేరువైన కిరణ్ అబ్బవరం ఇటీవల వచ్చిన ‘సెబాస్టియన్ PC 524’ తో డిజాస్టర్ ను మూటగట్టుకున్నాడు. ఈ మూవీ రాంగ్ టైములో రావడం వలనో ఏమో కానీ మినిమమ్ కలెక్షన్లను కూడా రాబట్టలేకపోయింది. అయితే ఇప్పుడు ‘సమ్మతమే’ అనే లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. గోపీనాథ్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు కాగా చాందినీ చౌదరి హీరోయిన్ గా నటించింది.
శేఖర్ చంద్ర అందించిన మ్యూజిక్ ఈ సినిమా పై అంచనాలు పెరిగేలా చేశాయి.దీంతో కిరణ్ గత సినిమా ప్లాప్ అయినా ‘సమ్మతమే’ కి మంచి థియేట్రికల్ బిజినెస్ జరిగింది. వాటి వివరాలను ఓసారి గమనిస్తే :
నైజాం | 1.70 cr |
సీడెడ్ | 1.20 cr |
ఉత్తరాంధ్ర | 1.35 cr |
ఈస్ట్ | 0.24 cr |
వెస్ట్ | 0.17 cr |
గుంటూరు | 0.28 cr |
కృష్ణా | 0.19 cr |
నెల్లూరు | 0.20 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 5.33 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.55 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 5.88 cr |
‘సమ్మతమే’ చిత్రానికి రూ.5.88 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు రూ.6 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. కిరణ్ నటించిన గత 3 చిత్రాల్లో ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ మాత్రమే రూ.8 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది. కానీ ‘సెబాస్టియన్’ మూవీకి మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రాలేదు.
ఇక ఇప్పుడు థియేటర్ల పరిస్థితి ఏమీ బాలేదు. జనాలు థియేటర్ కు వెళ్లడం తగ్గించేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ‘సమ్మతమే’ కి ఉన్న పాజిటివ్ హోప్ ఏమైనా ఉందా అంటే అది ‘గీతా ఆర్ట్స్’ వారు ఈ చిత్రాన్ని విడుదల చేయడమే అని చెప్పాలి.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!