తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా కొనసాగుతున్న బాలకృష్ణ అంటే చాలా మంది భయపడతారు. బాలకృష్ణకు ముక్కుమీద కోపం అని ఆయన ఇతరులపై ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేయి చేసుకుంటాడని పెద్దఎత్తున అతని గురించి చెడుగా ప్రచారం చేస్తూ ఉంటారు. అయితే అతనికి బాగా దగ్గరైన వాళ్ళు మాత్రం ఇలాంటి వ్యాఖ్యలను కొట్టిపారేస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే అతనితో కలిసి పలు సినిమాలలో నటించిన నటీనటులు బాలకృష్ణ వ్యక్తిత్వం గురించి ఇదివరకే ఎన్నోసార్లు వెల్లడించారు.
తాజాగా బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన అఖండ సినిమాలో నటించిన నటుడు సమ్మెట గాంధీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని బాలకృష్ణ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అఖండ సినిమా ప్రారంభానికి ముందు బోయపాటి శీను తనకి ఫోన్ చేసి తన కోసం ఒక పాత్ర ఉంది అందులో మీరే నటించాలని చెప్పారు. ఈ విధంగా బోయపాటి శ్రీను అవకాశం ఇవ్వడంతో ఎంతో సంతోషించాను.
సాధారణంగా ఒక సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకునే టప్పుడు ముందుగా కొబ్బరికాయ హీరోలతో కొట్టిస్తారు. కానీ బోయపాటి శ్రీను నా చేత ఈ సినిమాకి కొబ్బరికాయ కొట్టించారని సందర్భంగా సమ్మెట గాంధీ వెల్లడించారు. ఆరోజు బోయపాటి శ్రీను నాకు ఇచ్చిన గౌరవం ఎప్పటికీ మర్చిపోలేననీ సమ్మెట గాంధీ ఈ సందర్భంగా వెల్లడించారు. ఇక పోతే సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత చాలామంది బాలకృష్ణ గురించి నా దగ్గర కూడా అలాగే చెప్పారు. ఆయన చాలా కోపం, ఆయనకి నమస్కారం కూడా పెట్టకూడదని చెప్పారు.
అయితే షూటింగ్ ప్రారంభమైన తర్వాత ఆయనతో కలిసి షూటింగ్ చేసినన్ని రోజులు కూడా ప్రతిరోజు ఉదయం బాలకృష్ణ గారు కనబడుతూనే నమస్కారం సార్ అంటే ఆయన కూడా నమస్కారం పెడుతూ ఎంతో నవ్వుతూ మాట్లాడే వారని ఆయన తెలిపారు.అందరూ చెప్పినట్టు బాలకృష్ణ వ్యక్తిత్వం అలాంటిది కాదు.ఆయన మనసులో ఎలాంటి కల్మషం ఉండదు.గొప్ప మనస్తత్వం వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి బాలకృష్ణ అంటూ ఈ సందర్భంగా ఈయన బాలకృష్ణ గురించి షాకింగ్ కామెంట్ చేశారు.
Most Recommended Video
విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!/a>
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!