Samyuktha Menon: కట్స్ లేకుండా ఫిట్స్ సీన్ లో చేశానన్న సంయుక్త.. డామినేట్ చేయలేదంటూ?

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన సంయుక్త మీనన్ తెలుగు, తమిళ భాషల్లో వరుస విజయాలతో కెరీర్ పరంగా దూసుకెళుతున్నారు. విరూపాక్ష సినిమాలో సంయుక్త మీనన్ పోషించిన పాత్ర ఆమెకు ఎంతో మంచి పేరును తెచ్చిపెట్టింది. ఆ పాత్రకు సంబంధించి ఉండే ట్విస్టులు ప్రేక్షకులను ఒకింత ఆశ్చర్యానికి గురి చేశాయి. సంయుక్త మీనన్ కేరళ అమ్మాయి అయినా తెలుగు చక్కగా మాట్లాడతారనే సంగతి తెలిసిందే. సంయుక్త మీనన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 2021 సంవత్సరం నుంచి తెలుగులో ఎక్కువగా నాకు మూవీ ఆఫర్లు వస్తున్నాయని తెలిపారు.

అదే విధి అని ఆమె కామెంట్లు చేశారు. కరోనా లాక్ డౌన్ మొదలుకావడానికి కొన్నిరోజుల ముందు నెలన్నర రోజులు సోలోగా ట్రావెల్ చేశానని సంయుక్త చెప్పుకొచ్చారు. ఆ ట్రిప్ తర్వాత కొచ్చిలో ల్యాండ్ అయ్యానని వారం రోజుల తర్వాత పూర్తిస్థాయిలో లాక్ డౌన్ అమలైందని సంయుక్త చెప్పుకొచ్చారు. నా కళ్లకు కూడా అడిషన్స్ జరిగాయని మ్యూజిక్ ప్లే చేస్తే వేర్వేరు ఎక్స్ ప్రెషన్లను నేను పలికించానని సంయుక్త కామెంట్లు చేశారు.

ఒక బుక్ ను హ్యాండ్ బ్యాగ్ లో తెచ్చుకుని బాగున్నారా తిన్నారా అని సెట్ లో మాట్లాడేదానినని ఎలా ఉన్నారు అని అడిగితే అవతలి వాళ్లు చూపించే ప్రేమకు అడిక్ట్ అయ్యానని సంయుక్త మీనన్ కామెంట్లు చేశారు. విజయశాంతి గారు స్పూర్తి అని ఆమె వెల్లడించారు. ఫిట్స్ సన్నివేశంలో నటించడానికి నేను కొరియోగ్రఫీ ఫిక్స్ చేశానని 90 సెకన్ల పాటు కదలకుండా ఎలాంటి కట్స్ లేకుండా ఆ సీన్ చేశానని ఆమె తెలిపారు.

నేను (Samyuktha Menon) స్క్రీన్ పై డామినేట్ చేశానని చాలామంది చెబుతున్నారని అయితే ఎవరూ ఎవరినీ డామినేట్ చేయలేరని ఒకవేళ ఒక పాత్ర ఎక్కువగా ఫోకస్ ను కలిగి ఉండవచ్చని సంయుక్త మీనన్ వెల్లడించారు. సంయుక్త మీనన్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus