Samyuktha Menon: విరూపాక్ష కోసం చాలా రిస్క్ చేశాను!

భీమ్లా నాయక్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు మలయాళీ నటి సంయుక్త మీనన్. ఈ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం వరుస సినిమాలలో నటిస్తూ తెలుగులో మంచి గుర్తింపు పొందారు. అయితే ధనుష్ హీరోగా నటించిన సార్ చిత్రాన్ని తమిళంలో వాతి అనే పేరిట విడుదల చేశారు. ఈ సినిమా తమిళంలో కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఇలా తెలుగు తమిళ భాషలలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన సంయుక్త మీనన్ తాజాగా విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో హిట్ సినిమాని అందుకుంది.

ఇలా ఈ సినిమా తెలుగులో ఎంతో మంచి సక్సెస్ సాధించడంతో ఈ చిత్రాన్ని మే ఐదవ తేదీ తమిళ భాషలో కూడా విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే సంయుక్త తమిళంలో ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమె చెన్నైలో మీడియా సమావేశంలో పాల్గొని సినిమాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలియచేశారు. తాను ఏ విషయానికైనా ముందు ఓకే చెప్పి తర్వాత ఆలోచిస్తానని సంయుక్త వెల్లడించారు.

ఇక విరూపాక్ష సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా కోసం తాను చాలా రిస్క్ చేశానని తెలిపారు. లేడీ ఓరియంటెడ్ సినిమాల గురించి అలాగే సినిమాలలో హీరోయిన్ల పాత్రకు ఉండే ప్రాధాన్యత గురించి కూడా ఈమె మాట్లాడారు. ప్రస్తుత కాలంలో సినిమాలలో హీరోయిన్లు అంటే కేవలం హీరోల పక్కన రొమాంటిక్ సన్నివేశాలలో నటించడానికి అలాగే పాటలలో డాన్స్ చేయడానికి మాత్రమే తీసుకుంటున్నారు.

అయితే భవిష్యత్తులో హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యత ఉంటుందా అనే ప్రశ్న తలెత్తకూడదని ఈమె తెలియజేశారు. దయచేసి దర్శక నిర్మాతలు హీరోయిన్ పాత్రలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ఈమె ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.ఇక విరూపాక్ష సినిమాలో నందిని అనే పాత్రలో (Samyuktha Menon) సంయుక్త నటన అద్భుతమని చెప్పాలి.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus