ఈ నెల 5న (డిసెంబర్ 5న) బ్లాక్ బస్టర్ బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో ‘అఖండ 2’ చిత్రం రిలీజ్ కి సిద్ధంగా ఉంది.థమన్ మ్యూజిక్ అందిస్తుండగా, ఈ మూవీలో హీరోయిన్ సంయుక్త మీనన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా టిక్కెట్ల రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకోగా, ప్రేక్షకుల నుంచి భిన్న స్వరాలు వినపడుతున్నాయి.
రీసెంట్ గా హీరోయిన్ సంయుక్త మీనన్ మాట్లాడుతూ అఖండ 2 మూవీ ప్రేక్షకుల అంచనాలను మించి ఉండబోతుందని, మళ్లి ఒకసారి బాలయ్య బోయపాటి కాంబో మేజిక్ చేయబోతోందని చెప్పారు. ఈ చిత్రం లో తన పాత్ర కథను ముఖ్యమైన మలుపు తిప్పే రోల్ అని, తన పాత్ర చాలా స్టైలిష్ గా కూడా ఉంటుందని తెలియజేసారు.
అయితే సాయి దుర్గ తేజ్ హీరోగా నటించిన ‘విరూపాక్ష’ మూవీలో హీరోయిన్ గా నటించిన సంయుక్త మీనన్ , ఆ మూవీ లో విలక్షణమైన పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు సైతం పొందింది. ఆ తరువాత వరుస సినిమా ఆఫర్లు రాగా, అఖండ 2 మూవీ కోసం తన డేట్స్ ను సైతం అడ్జస్ట్ చేసుకొని నటించిందట ఈ బ్యూటీ.
ప్రస్తుతం స్వయంభు, నారీ నారీ నడుమ మురారి చిత్రాల్లో నటిస్తున్నది. ఎల్లుండి రిలీజ్ అవ్వనున్న అఖండ 2 కి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ అభిమానుల అంచనాలను ఎంత వరకు అందుకుంటుందో చూడాలి…!