Sandeep: బిగ్ బాస్ హౌస్ లో ఫుడ్ కష్టాలు చెప్పిన సందీప్ మాస్టర్!

బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారిలో సందీప్ మాస్టర్ ఒకరు. ఈయన ఈ కార్యక్రమం ప్రారంభంలోనే కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్లారు. అయితే ఈ కార్యక్రమంలో 8 వారాలపాటు కొనసాగినటువంటి సందీప్ మాస్టర్ ఎనిమిదవ వారం నుంచి బయటకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇలా హౌస్ నుంచి ఈయన ఎలిమినేట్ కావడంతో పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సందీప్ మాస్టర్ బిగ్ బాస్ కార్యక్రమం గురించి పలు విషయాలను తెలియజేశారు.

ముఖ్యంగా బిగ్ బాస్ కార్యక్రమంలో ఫుడ్ కష్టాల గురించి ఈయన మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. హౌస్ లో ఉన్నప్పుడు బ్రేక్ ఫాస్ట్ వచ్చేది కాదని తెలిపారు. నైట్ ఏదైనా మిగిలినప్పుడు దానిని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటామని మరుసటి రోజు దానినే తింటామని తెలిపారు. నాకు ఉదయమే రైస్ తినడం అలవాటు లేకపోవడంతో నేను ఏదైనా ఒక ఫ్రూట్ తినేవాడిని అయితే ఫుడ్ కి కావాల్సినటువంటి గ్రోసరీ తక్కువగా రావడంతో అందరికీ సరిపడా ఫుడ్ తయారు చేసుకోలేమని ఉన్నదాంట్లోనే అందరం అడ్జస్ట్ చేసుకొని తినేవాళ్ళం అని తెలియజేశారు.

ఎప్పుడైనా రాత్రి మిగిలిన అన్నం ఉంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తిన్న రోజులు కూడా ఉన్నాయని ఈయన తెలియజేశారు. ఒక బిస్కెట్ ప్యాకెట్ పంపిస్తారు దానిని అందరూ షేర్ చేసుకోవాల్సిందే. అలాగే బ్రెడ్ కూడా ఒక ప్యాకెట్ పంపిస్తే తలా ఒక స్లైస్ అడ్జస్ట్ చేసుకొని తినాల్సి ఉంటుందని సందీప్ మాస్టర్ తెలిపారు. ఇక బిగ్ బాస్ ఇచ్చే టాస్కులలో పార్టిసిపేట్ చేసి అంతమందికి ఫుడ్ చేయాలి అంటే ఓపిక కూడా ఉండేది కాదు అది మరొక టాస్క్ అని తెలిపారు.

హౌస్ లో ఉంటే చాలా మెంటల్ టెన్షన్ ఉంటుందని అందుకే చాలామంది బరువు కూడా తగ్గిపోతారని సందీప్ మాస్టర్ తెలిపారు. తాను బిగ్ బాస్ హౌస్ లో నుంచి బయటకు వచ్చేసరికి 12 నుంచి 15 కేజీల వరకు తగ్గిపోయానని ఈ సందర్భంగా (Sandeep) ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus