ఎవరిలో ఏ ట్యాలెంట్ ఉందో అనుభవం ఉన్నవారు సైతం అంచనా వేయలేరు. అలాగే సందీప్ రెడ్డి విషయంలోనూ శర్వానంద్ తక్కువ అంచనా వేశారు. ఈ యువ డైరక్టర్ చెప్పిన కథను ఒకే చేయకుండా తప్పుచేశారు. సందీప్ రెడ్డి నమ్మిన కథతో తెరకెక్కించిన మూవీ అర్జున్ రెడ్డి. విజయ్ దేవర కొండ , షాలిని జంటగా నటించిన ఈ సినిమా నిన్న రిలీజ్ అయి సంచలనం సృష్టిస్తోంది. ఒక్కరోజులోనే 4 కోట్లకు పైగా కలక్షన్స్ రాబట్టి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దీంతో శర్వానంద్ తన తప్పుని తెలుసుకొని సందీప్ రెడ్డి ని సోషల్ మీడియా వేదికపై అభినందించారు. “దర్శకుడు సందీప్ రెడ్డి ముందుగా అర్జున్ రెడ్డి కథను నాకు వినిపించారు.
కానీ కొన్ని కారణాల వల్ల సినిమా చేయలేకపోయాను. ఈ సినిమా సక్సెస్ సంతోషాన్నిస్తుంది. విజయ్ దేవరకొండతో పాటు యూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు” అని తన ఫేస్ బుక్ ద్వారా శర్వానంద్ తెలిపారు. ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో “మహానుభావుడు” సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న శర్వానంద్ నెక్స్ట్ సినిమాని సందీప్ రెడ్డి తో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.