జగపతి బాబు హోస్ట్ చేస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ టాక్ షోలో దర్శకులు రాంగోపాల్ వర్మ, సందీప్ రెడ్డి వంగా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమో భారీ హైప్ క్రియేట్ చేసింది. ఇక ఫుల్ ఎపిసోడ్ ‘జీ5’ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు జరిగిన ఎపిసోడ్స్ అన్నిటికంటే ఇది మంచి రీచ్ వచ్చే ఎపిసోడ్ అని అంతా అంటున్నారు. ఇక ఈ షోలో దర్శకుడు సందీప్ రెడ్డి మాట్లాడుతూ.. “రామ్ గోపాల్ వర్మ చాలా విషయాల్లో నాకు గురువు లాంటివారు. ఆయన సినిమాలు చూసి నాకు తెలియని చాలా విషయాలు తెలుసుకున్నాను. ‘సత్య’ సినిమా 60 సార్లు చూశాను. దాని వల్ల నేను ఎడిటింగ్ నేర్చుకున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.
నిజమే సందీప్ చెప్పాడని మాత్రమే కాదు. గతంలో రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాలు చాలా మంది దర్శకులకు టెక్స్ట్ బుక్ మాదిరి పనిచేశాయి. ‘శివ’ ‘సర్కార్’ ‘కంపెనీ’ ‘రంగీలా’ ‘రక్త చరిత్ర’ ఇలా ఏది తీసుకున్నా అది పాత్ బ్రేకింగ్ మూవీ అనొచ్చు.
అంతేకాదు సందీప్ రెడ్డి వంగా ఇంకా మాట్లాడుతూ.. “ఇప్పటివరకు నేను చూసిన సినిమాల్లో ‘బాహుబలి 2’ ఇంటర్వెల్ సీన్ ది బెస్ట్ అని నా అభిప్రాయం.అలాంటి ఇంటర్వెల్ సీన్ అప్పటివరకు తెలుగు సినిమాల్లో రాలేదు. ‘బాహుబలి 2’ చూసిన తర్వాత వెళ్లి నా ‘అర్జున్ రెడ్డి’ ఇంటర్వెల్ సీన్ చూసుకున్నాను. ‘బాహుబలి 2’ వంటి ఇంటర్వెల్ బ్లాక్ చూశాక జనాలకు ‘అర్జున్ రెడ్డి’ ఇంటర్వెల్ నచ్చుతుందా?’ అనే భయం వేసింది. ఇంటర్వెల్ సీన్ కూడా చాలా గొప్పగా ఉండాలని రాజమౌళి నేర్పించారు” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి అని చెప్పాలి.