Sandeep Reddy Vanga: ఇదే మాస్‌ మామా… రిలీజ్‌కు ముందే సందీప్‌కి కాస్ట్‌లీ కారు గిఫ్టా..!

మాస్‌ సినిమాలో కాస్త డిఫరెంట్‌ ఎలిమెంట్‌, స్టైల్‌ యాడ్‌ చేసి సినిమా చేస్తే.. ఆ దర్శకులు టాప్‌ లీగ్‌లోకి వెళ్తారు అంటారు. అలా బాలీవుడ్‌లోకి వెళ్లిపోతుంటారు. అలా వెళ్లిన ఓ దర్శకుడు అట్లీ ఇటీవల ‘జవాన్‌’తో భారీ విజయం అందుకున్నారు. అంతకుమందు టాలీవుడ్ నుండి కూడా కొంతమంది దర్శకులు వెళ్లారు. ఇలా వెళ్లి ఓ ప్రాజెక్ట్‌ చేసి విడుదలకు రెడీగా ఉన్నారు సందీప్‌ రెడ్డి వంగా. మన ‘అర్జున్‌ రెడ్డి’ని ‘కబీర్‌ సింగ్‌’గా బాలీవుడ్‌కి తీసుకెళ్లి భారీ విజయం అందుకున్న ఆయన… ఇప్పుడు ‘యానిమల్‌’తో రాబోతున్నారు.

ఈ సినిమా విడుదల తేదీ గురించి నిన్న మొన్నటి వరకు మాట్లాడుకున్నారు అందరూ. ఆ మాటకొస్తే ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. ఎందుకంటే సినిమాకు ఇంకా 20 రోజులే ఉంది. అయితే సినిమా తర్వాత, అందులోనూ విజయం సాధించిన తర్వాత నిర్మాతలు చేసే ఓ పని.. ఇంకా సినిమా విడుదల కాకముందే చేసేశారు అని చెబుతున్నారు. దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా కోసం నిర్మాత అప్పుడే ఓ ఖరీదైన కారును కొనుగోలు చేశారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

సినిమా విజయం సాధిస్తే ఆ టీమ్‌కు నిర్మాత గిఫ్ట్‌లు ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. మొన్నటికి మొన్న ‘బేబీ’ దర్శకుడు ఇలానే కారు అందుకుంటే… ‘జైలర్‌’ తర్వాత నిర్మాత ఇలానే హీరో, దర్శకుడు, సంగీత దర్శకుడికి కార్లు ఇచ్చారు. అయితే ఇప్పుడు ‘యానిమల్‌’ నిర్మాత భూషణ్‌ కుమార్‌ ఇప్పుడే దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు కారు ఇచ్చేశారట. అది కూడా రూ. 5 కోట్ల కారు అని టాక్‌. డిసెంబరు 1న సినిమా విడుదల సందర్భంగా ముందస్తుగానే తన ఆనందం పంచుకున్నారు అని అంటున్నారు.

నిజానికి సందీప్‌(Sandeep Reddy Vanga)  తొలి హిందీ సినిమా ‘కబీర్‌ సింగ్‌’ కూడా టీ సిరీస్‌ బ్యానర్‌లోనే నిర్మితమైంది. ఆ సినిమా విజయం, ఇప్పుడు ‘యానిమల్‌’ అందిస్తున్న ప్రీ బిజినెస్‌ చూసి నిర్మాత భూషణ్‌ కుమార్‌ కారు గిఫ్ట్‌ ఇచ్చారట. అయితే గిఫ్టే ఇంత రేటుది ఇచ్చారంటే ఇక రెమ్యూనరేషన్‌ ఎంత ఇచ్చి ఉంటారో అనే వాదన కూడా వినిపిస్తోంది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus