మూసలో పడిపోయిన బాలీవుడ్ కి కొత్త దారి చూపిన తెలుగు దర్శకులు

1996 వరకూ బాలీవుడ్ లో పెద్దగా యాక్షన్ సినిమాలు రాలేదు. వచ్చినా ఆ యాక్షన్ లోనూ ఫ్యామిలీ సెంటిమెంట్స్ ను ఇరికించేసేవారు అక్కడి దర్శకనిర్మాతలు. దాంతో బాలీవుడ్ అంటే ఓవర్ సెంటిమెంటల్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ లా అయిపోయింది. అలాంటి సందర్భంలో రాంగోపాల్ వర్మ అనే వ్యక్తి “సత్య” అనే బాలీవుడ్ సినిమా తీసి.. హిందీ ఇండస్ట్రీకి “గ్యాంగ్ స్టర్ సినిమా” రుచి చూపించాడు. నిజమైన ఫైట్స్ అంటే ఎలా ఉంటాయి, నిజమైన యాక్షన్ బ్లాక్స్ ఎలా ఉంటాయి అనేది చూపించాడు. అందుకే “సత్య” ఇప్పటికీ ఇండియాస్ బెస్ట్ ఫిలిమ్స్ లో ఒకటి. అనంతరం వర్మ బాలీవుడ్ లో చేసిన రచ్చకి పెద్ద పెద్ద స్టార్ ప్రొడ్యూసర్స్ & డైరెక్టర్సే సైలెంట్ అయిపోయారు. అయితే.. తదనంతర కాలంలో వర్మ మరీ వికృతమైన ప్రయోగాలు చేసుకుంటూ వెళ్లిపోవడంతో బాలీవుడ్ వర్మను లైట్ తీసుకొంది.

వర్మ తర్వాత చాలా మంది తెలుగు దర్శకులు బాలీవుడ్ లో సినిమాలు తీసినప్పటికీ.. పెద్దగా ఇంపాక్ట్ మాత్రం క్రియేట్ చేయలేకపోయారు. దాంతో బాలీవుడ్ బ్యాచ్ అందరూ సౌత్ సినిమాను తక్కువ చేసి చూడడం మొదలెట్టారు. కానీ.. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత బాలీవుడ్ ను మాత్రమే కాదు యావత్ నార్త్ ఇండస్ట్రీని కుదేలు చేస్తున్నాడు మన తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. కేవలం “కబీర్ సింగ్”తో 200 కోట్ల క్లబ్ లో స్థానం సంపాదించుకోవడం మాత్రమే కాదు.. బాలీవుడ్ క్రిటిక్స్ ను ఏకిపాడేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నాడు. ఆఖరికి టాలీవుడ్ నుంచి కూడా సమంత, అదితిరావు హైదరీ లాంటి నటీమణులు సందీప్ రెడ్డి వంగా ఆలోచనా ధోరణి గురించి నెగిటివ్ గా మాట్లాడినప్పటికీ.. జనాలు మాత్రం సందీప్ ను సపోర్ట్ చేస్తుండడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus