Sarzameen Movie Review in Telugu: సర్జమీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • పృథ్వీరాజ్ సుకుమారన్ (Hero)
  • కాజోల్ (Heroine)
  • ఇబ్రహీం అలీఖాన్ తదితరులు.. (Cast)
  • కయోజే ఇరానీ (Director)
  • కరణ్ జోహార్ - హిరో యశ్ జోహార్ - అపూర్వ మెహతా - అడర్ పూనావాలా (Producer)
  • విశాల్ మిశ్రా - విశాల్ ఖురానా (Music)
  • కమల్ జీత్ నేగి (Cinematography)
  • నితిన్ బెయిడ్ (Editor)
  • Release Date : జూలై 25, 2025
  • ధర్మ ప్రొడక్షన్స్ - స్టార్ స్టూడియోస్ (Banner)

సైఫ్ అలీఖాన్ మొదటి భార్య యొక్క కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ ను హీరోగా ఎస్టాబ్లిష్ చేయడం కోసం కరణ్ జోహార్ ప్రొడ్యూస్ చేసిన సినిమా “సర్జమీన్”. పృథ్వీరాజ్ సుకుమారన్, కాజోల్ కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రంలో ఇబ్రహీం ఓ ముఖ్యపాత్ర పోషించాడు. హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించగలిగిందో చూద్దాం..!!

Sarzameen Movie Review in Telugu

కథ:

విజయ్ మీనన్(పృథ్వీరాజ్ సుకుమారన్) ఓ స్ట్రిక్ట్ ఆర్మీ ఆఫీసర్. కుటుంబం కంటే దేశమే ముఖ్యం అనుకునే సైనికుడు. ఒకానొక సందర్భంలో కొందరు టెర్రరిస్టులను అడ్డుకొనేందుకు సొంత కొడుకుని పణంగా పెట్టాల్సి వస్తుంది. ఆ సమయంలో విజయ్ మీనన్ తీసుకున్న నిర్ణయం అతడి జీవితాన్ని ఎలా మార్చింది? ఆ కారణంగా ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి? అనేది “సర్జమీన్” కథాంశం.

నటీనటుల పనితీరు:

పృథ్వీరాజ్ సుకుమారన్, కాజోల్ లు సీనియర్ యాక్టర్లు. వాళ్ల నటన ఎలా ఉంది, ఎలా చేశారు అని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అయితే.. వాళ్ల పాత్రలను డిజైన్ చేసిన తీరు మాత్రం అలరించలేకపోయింది. క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఎంత ముఖ్యం అనే విషయాన్ని దర్శకుడు సీరియస్ గా తీసుకోకపోవడం వల్ల ఆ పాత్రలు సరిగా పండలేదు. ఇక కాజోల్ పోషించిన పాత్ర “ఫనా” సినిమాకి వాట్ ఇఫ్? వెర్షన్ లా ఉండడం గమనార్హం. బహుశా ప్రేక్షకులు అలా అనుకోవాలనే దర్శకుడు ఆమెను క్యాస్ట్ చేసి ఉండొచ్చు.

ఇక ఇబ్రహీం అలీఖాన్ నటుడిగా ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది. కోపంతో అరిచే సన్నివేశాల్లో పర్వాలేదు కానీ.. మిగతా సీన్స్ లో మాత్రం బేలమొహం వేసుకుని ఎక్స్ ప్రెషన్ లేకుండా నిల్చున్నాడు.

మిగతా సపోర్టింగ్ క్యాస్ట్ అంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు:

టెక్నికల్ గా మంచి సినిమాగా “సర్జమీన్”ను పేర్కొనవచ్చు. మ్యూజిక్, ఎడిటింగ్, ప్రొడక్షన్ డిజైన్ వంటివన్నీ టాప్ లెవల్లో ఉన్నాయి. ముఖ్యంగా నేపథ్య సంగీతం చాలా బాగుంది. అయితే సన్నివేశాల్లో ఎక్కడా సరైన స్థాయి ఎమోషన్ పండకపోవడంతో టెక్నికాలిటీస్ సరిగా ఎలివేట్ అవ్వలేదు.

దర్శకుడు కయోజే మంచి ఆసక్తికరమైన పాయింట్ ను మూలకథగా ఎంచుకున్నాడు. అయితే కథనం విషయంలోనే తడబడ్డాడు. ఎంత ఎమోషనల్ డ్రామా అయినప్పటికీ.. సరైన స్క్రీన్ ప్లే లేకపోతే సన్నివేశాలు పండవు సరికదా, కనీసం అలరించవు. “సర్జమీన్” విషయంలో జరిగిందే అదే. ఫ్యామిలీ ఎమోషన్స్, దేశభక్తి, త్యాగం వంటి అంశాలన్నీ కలగలిపినా.. అవేవీ సరిగా పొసగలేదు. అందువల్ల సినిమాగా ఆకట్టుకోలేకపోయింది.

విశ్లేషణ:

ఒక సినీ వారసుడ్ని హీరోగా ఎస్టాబ్లిష్ చేసేప్పుడు.. సదరు హీరో ప్లస్ పాయింట్ ఏమిటి? మైనస్ లు ఏమిటి? అనేది సరిగ్గా చూసుకోవాలి. ఒక మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసే ఆలోచన ఉన్నప్పుడు, పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రయోగాలు చేయకూడదు, అది కూడా హీరో ఇంకా హావభావాల ప్రకటనలో పరిణితి చెందనప్పుడు. మరి కరణ్ జోహార్ & టీమ్ ఏ ఆలోచనతో పృథ్వీరాజ్ సుకుమారన్, కాజోల్ లాంటి సీనియర్ & ప్రూవెన్ ఆర్టిస్టుల మధ్య ఇబ్రహీంను పెట్టి, అది కూడా అతడు డామినేట్ చేయాల్సిన స్థాయి సన్నివేశాలు ఉన్న చిత్రంలో ఇబ్రహీం ను క్యాస్ట్ చేయడమే పెద్ద మిస్టేక్. ఆ కారణంగా ఈ చిత్రం అటు ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో కానీ, మెప్పించడంలో కానీ దారుణంగా విఫలమైందనే చెప్పాలి.

ఫోకస్ పాయింట్: అలరించలేకపోయిన వారసుడి సినిమా!

రేటింగ్: 1.5/5

ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus