లస్ట్ స్టోరీస్ తెలుగు రీమేక్ నుంచి తప్పుకున్న సందీప్ రెడ్డి!

బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసి.. టాలీవుడ్ లోనూ పెను దుమారం సృష్టించిన “లస్ట్ స్టోరీస్”ను తెలుగులో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నాలుగు ఎపిసోడ్స్ సిరీస్ ను హిందీలో వలే తెలుగులోను నలుగురు దర్శకులు డైరెక్ట్ చేయాలని ఫిక్స్ చేశారు. నందిని రెడ్డి, సందీప్ రెడ్డి వంగా, సంకల్ప్ రెడ్డి, తరుణ్ భాస్కర్ లు చెరో ఎపిసోడ్ ను డైరెక్ట్ చేయనున్నారని అఫీషియల్ న్యూస్ కూడా వచ్చింది. ఒక ఎపిసోడ్ కోసం ఆల్రెడీ అమలాపాల్ & జగపతిబాబును ఫైనల్ కూడా చేసేశారు.

అయితే.. ఇప్పుడు ఈ సిరీస్ నుండి సందీప్ రెడ్డి వంగా తప్పుకొన్నట్లు తెలుస్తోంది. ఈ తరహా శృంగారాన్ని తాను తెరకెక్కించలేనని, తనకు మొదట పరువు హత్య నేపధ్యంలో ఎపిసోడ్ అని చెప్పారని, ఆ తర్వాత కేవలం లస్ట్ నేపధ్యంలో ఎపిసోడ్ చేయాలని చెప్పారని, అలాంటివి చేయడం తన వల్ల కాదని క్లారిటీ ఇచ్చాడు సందీప్ రెడ్డి. అలాగే.. భవిష్యత్ లో తానే ఒక వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తానని, ఓ నాలుగు స్నేహితుల నేపధ్యంలో సాగే ఈ సిరీస్ స్టోరీని సినిమాగా కూడా తీయొచ్చు కానీ.. సెన్సార్ బోర్డ్ యాక్సెప్ట్ చేయదు. అందుకే ఆ వెబ్ సిరీస్ మాత్రం తీస్తాను అని క్లారిటీ ఇచ్చాడు. ఇకపోతే.. సందీప్ రెడ్డి ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు సినిమాలు చేయడానికి సన్నద్ధమవుతున్నాడు.

బర్త్ డే స్పెషల్ : ప్రభాస్ రేర్ అండ్ అన్ సీన్ పిక్స్…!
బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus