Sandeep Reddy Vanga: సినిమా విడుదలకు ముందే డైరెక్టర్ కు కాస్ట్లీ గిఫ్ట్!

సాధారణంగా ఒక సినిమా మంచి సక్సెస్ అవడంతో మాత్రం దర్శకులకు హీరోలకు ఖరీదైన గిఫ్ట్లను కానుకగా ఇవ్వడం మనం చూస్తున్నాము. ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో ఇది సరికొత్త ట్రెండ్ అవుతుంది. అయితే సినిమా విడుదల కాకుండానే డైరెక్టర్లకు గిఫ్ట్లు ఇవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అర్జున్ రెడ్డి సినిమా ద్వారా సెన్సేషనల్ డైరెక్టర్ గా పేరు పొందినటువంటి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దర్శకుడుగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన కబీర్ సింగ్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి వచ్చారు. ఇలా అర్జున్ రెడ్డి సినిమాకు రీమేక్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సందీప్ రెడ్డి తాజాగా రణబీర్ కపూర్ రష్మిక హీరో హీరోయిన్లుగా యానిమల్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధమవుతున్నారు ఈ సినిమా డిసెంబర్ ఒకటవ తేదీ విడుదల కాబోతోంది.

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు ఇదిలా ఉండగా తాజాగా నిర్మాత భూషణ్ కుమార్ డైరెక్టర్ కు సినిమా విడుదల కాకుండానే ఐదు కోట్ల రూపాయల విలువచేసే ఖరీదైన కారును బహుమానంగా ఇచ్చారంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. సినిమాపై చాలా నమ్మకంతోనే డైరెక్టర్ కి ఇలాంటి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారని సమాచారం.

ఇలా ఇప్పటివరకు ఎంతో మంది డైరెక్టర్లకు నిర్మాతలు కార్లు ఇచ్చారు కానీ ఎవరు కూడా ఇంత ఖరీదైన కానుక ఇవ్వలేదని (Sandeep Reddy Vanga) సందీప్ రెడ్డి వంగా మాత్రమే ఖరీదైన కారును గిఫ్ట్ గా అందుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈయన నిజంగానే ఇచ్చారా లేక పబ్లిసిటీలో ఇది కూడా ఒక భాగమైన అంటూ పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. ఏది ఏమైనా సినిమాపై ఉన్న నమ్మకంతోనే ప్రొడ్యూసర్ ఇలా ఖరీదైన కారుని ఇచ్చారని తెలుస్తుంది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus