Sandhya Janak: సీనియర్ నటులపై సంచలన వ్యాఖ్యలు చేసిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ సంధ్య జనక్!

ఆన్ స్క్రీన్ అంటే ప్రొఫెషన్‌ కాబట్టి నటీనటులు ఎంత మాట్లాడినా.. ఎలా మాట్లాడినా నడిచిపోతుంది.. కానీ పబ్లిక్ ఫంక్షన్స్‌, మీడియా ముందు మాట్లాడేటప్పు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి.. కొంచెం బ్యాలన్స్ తప్పినా వ్యవహారం వేరేలా ఉంటుంది.. ఏ ఉద్దేశంతో అన్నారు?.. వాళ్ల వెర్షన్ ఏంటనేది ఎవరూ పట్టించుకోరు.. అందుకే, ఎందుకు లేని పోని తలనొప్పులు కొని తెచ్చుకోవడం అని చాలా మంది మౌనంగా ఉండిపోతారు..రీసెంట్‌గా సీనియర్ నటి రమాప్రభ, వెర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్‌ల గురించి పాపులర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సంధ్య జనక్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..

‘అర్జున్‌ రెడ్డి’, ‘భరత్‌ అనే నేను’, ‘గీతా గోవిందం’ లాంటి సినిమాల్లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంధ్య చాలా వరకు హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలు వేస్తుంటారు.. తెలుగుతో పాటు తమిళంలోనూ సినిమాలు చేస్తున్నారామె.. గతంలో సంధ్య.. రమాప్రభ, ప్రకాష్ రాజ్ గురించి కామెంట్స్ చేసిన పాత వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది..‘‘ప్రకాష్ రాజ్ ఓ లెజెండ్.. కాకపోతే ఆయనకి షార్ట్ టెంపర్ ఎక్కువ.. అది ఆయనకున్న అనుభవం వల్ల వచ్చి ఉండొచ్చు..

ఆయన కాంబినేషన్‌లో సీన్ చెయ్యాలంటే భయపడేదాన్ని.. డైలాగ్ సరిగా చెప్పకపోతే ఎక్కడ కోపం వస్తుందోనని కంగారు పడేదాన్ని.. ఒకసారి ఎక్కడ మర్చిపోతానోనని ఆయన కంటే ముందే నా డైలాగ్ చెప్పేశా.. దాంతో ఆయన ఒక్కసారిగా కోపంగా నావైపు చూశారు.. సారీ సార్.. సారీ అంటే.. నో, నో.. ఇట్స్ ఓకే అన్నారు’’ అని చెప్పుకొచ్చారు..‘‘సీనియర్ నటి రమాప్రభ గారితో ఎలాంటి ఇబ్బంది లేదు.. ఆవిడ ముందు నుండే క్రిటికల్..

వాళ్లు స్టార్స్‌గా ఉన్న ఆ రోజుల్లో షూటింగ్ వతావరణం, నటుల గురించి ఇప్పటి ఇండస్ట్రీతో కంపేర్ చేస్తుండేవారు.. ఆమె సీనియర్ కాబట్టి ఇప్పటి వాళ్లతో ఆమె ఇరిటేట్ అవుతుంటారు.. డైరెక్టర్లకి కూడా సలహాలిస్తుంటారు.. కొంచెం డామినేటెడ్‌గా ఉంటారు.. పెద్దావిడ కదా.. ఆమె చెప్పేవన్నీ ఓపిగ్గా వినాలి’’ అని చెప్పుకొచ్చారు సంధ్య జనక్..

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus