బాహుబలి స్పూర్తితో తమిళ దర్శకుడు సుందర్.సి సంఘమిత్ర అనే సినిమాని రెండేళ్ళక్రితమే ప్రారంభించారు. జయం రవి, ఆర్య, శృతి హాసన్ లను ప్రధాన పాత్రల్లో తీసుకున్నారు. శృతి ఇందు కోసం శిక్షణ కూడా తీసుకుంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని కేన్స్ వేడుకలో రిలీజ్ చేశారు. యువరాణిగా శృతి గుర్రం ఎక్కిన పోస్టర్ కూడా రిలీజ్ చేసి ఆశ్చర్య పరిచారు. అయితే రెగ్యులర్ షూటింగ్ మొదలు కాకముందే ఆమె తప్పుకుంది. దీంతో ఈ ప్రాజక్ట్ ఆగిపోయింది. ఆమె పాత్రకు బాలీవుడ్ నటి దిశా పటానిని సెలక్ట్ చేసినట్లు తెలిసింది. ఆమె శిక్షణ కూడా పూర్తికావడంతో ఆగస్టు నుంచి సెట్స్ మీదకు వెళ్ళడానికి అంతా సిద్ధం చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాలు తెలిపాయి.
బాహుబలి చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేసిన సాబు సిరిల్ ఈ ప్రాజెక్ట్ లో భాగస్వామ్యం కావడం విశేషం. శ్రీ తేనండాళ్ ఫిలిమ్స్ వారు 400 కోట్లతో నిర్మిస్తున్న ఈ చిత్రం కూడా రెండు భాగాలుగా విడుదల కానుంది. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్లో సాగనున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏకకాలంలో తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించి, మరో నాలుగు భాషల్లో అనువాదం చేసి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలనీ చిత్ర బృందం భావిస్తోంది.