పోస్టులో ఒకటి.. చేసేది మరొకటి
ఫెస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లలో నేటి యువత చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. వ్యక్తిగతమైన, సమాజానికి సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. ఇలా ఉండాలి, అలా ఉండాలి.. వాళ్లు చేసింది బెటర్.. వీరు చేసింది నచ్చలేదు అంటూ నిర్మొహమాటంగా అభిప్రాయాలను చెప్పేస్తున్నారు. వీరిలో మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పేవారు కొందరైతే.. తమ గురించి ఇతరులు గొప్పగా అనుకోవాలని మరి కొంతమంది పోస్ట్ లు చేస్తుంటారు. ఇటువంటి నకిలీ సింహాలపై మహాతల్లి హాస్య కొరడా ఝులిపించింది. “సాంఘిక ప్రసార మాధ్యమం” అనే క్యూట్ ఫిలింతో నవ్వించింది.
మ్యాటర్ ఏమిటంటే ?
“ఆరోగ్యంగా ఉండేందుకు సలాడ్స్ నే తీసుకోండి.. మేము అదే తింటున్నాము” అని పోస్ట్ చేసి… బిర్యానీ తినడం, “కుటుంబ సభ్యుల్లాంటి కొలీగ్స్ అంటూ సంబరపడుతూ ఫోటో షేర్ చేసుకోవడం” .. అనంతరం సీనియర్స్ తో అక్షింతలు వేసుకోవడం, “జ్వరం ఉన్నట్టు ఫోటో క్రియేట్ చేయడం.”. బిందాస్ గా ఇంట్లో గడపడం. ఆఫీస్ ఎగ్గొట్టడానికి ఈ స్టేటస్ ని ఆయుధంలా వాడుకోవడం, “పైరసీని తరిమికొట్టండి అంటూ స్టేట్ మెంట్లు ఇవ్వడం..” మరో వైపు పైరసీ వీడియో చూడడం.. ఇలా సోషల్ మీడియాలో పోస్టుల వెనుక దాగిన సత్యాల్ని సరదాగా జాహ్నవి బృందం చూపించింది. ఐదు నిముషాల ఈ వీడియోలో మీరు నవ్వుకోవడానికి ఎంతో ఉంది.