ప్రభాస్ సినిమా కొరకు సంజయ్ దత్ ఆ రేంజ్ లో తీసుకుంటున్నారా?

ప్రభాస్ మారుతి కాంబో మూవీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమా రిలీజ్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. రాజా డీలక్స్ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ మూవీ ప్రభాస్ కోరుకున్న భారీ విజయాన్ని అందించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈ సినిమా కోసం సంజయ్ దత్ ఏకంగా 12 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

ప్రభాస్ సంజయ్ దత్ కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ కాగా ప్రభాస్ కు తాతగా సంజయ్ దత్ కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో సంజయ్ దత్ నటించిన సినిమాలన్నీ సక్సెస్ సాధిస్తూ మంచి లాభాలను అందిస్తున్నాయి. సంజయ్ దత్ ఈ సినిమాతో కూడా సక్సెస్ ను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది. దేవర2 లో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

దేవర2 మూవీ గురించి వైరల్ అవుతున్న ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. మారుతి కెరీర్ ను ఒక విధంగా డిసైడ్ చేసే సినిమా ప్రభాస్ సినిమానే అని కూడా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మారుతి ఈ సినిమా విషయంలో చాలా ఆశలు పెట్టుకున్నారు. ప్రభాస్ మారుతి రేంజ్ ను ఈ సినిమా మరింత పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎంచుకునే కథల విషయంలో మారుతి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇతరుల సలహాలు తీసుకోవడం వల్లే తన డైరెక్షన్ లో తెరకెక్కిన కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాలను సొంతం చేసుకోలేదని మారుతి కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్ సినిమాకు మారుతి పరిమితంగానే పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. సినిమా సినిమాకు ప్రభాస్ (Prabhas) రేంజ్ ఊహించని స్థాయిలో పెరుగుతున్న సంగతి తెలిసిందే.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus