ఫస్ట్ లుక్, టైటిల్ రివీల్ చేయనున్న సంకల్ప్ రెడ్డి టీమ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఫిదా మూవీతో హిట్ ట్రాక్ లోకి వచ్చారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 60 కోట్లు వసూళ్లను సాధించింది. ఈ మూవీ తర్వాత వరుణ్ తేజ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో “తొలి ప్రేమ” సినిమా చేశారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందించింది. హ్యాట్రిక్ హిట్ కొట్టాలని వరుణ్ కొత్త కథని ఎంచుకున్నారు. ‘ఘాజి’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో అంతరిక్ష నేపథ్యంలో సినిమా చేస్తున్నారు. ఇందులో వ్యోమగామి (రోదసి యాత్రికుడు) గా వరుణ్ తేజ్ కనిపించనున్నారు. జీరోగ్రావిటీలో తేలియాడేట్టుగా నటించేందుకు అతను ప్రతేకంగా ఖజకిస్థాన్ లో శిక్షణ తీసుకున్నారు. ఇందులో అదితిరావు హైద‌రీ, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్ గా నటిస్తున్నారు.

ఇద్దరు హీరోయిన్స్ ఉన్నప్పటికీ రొమాంటిక్ సన్నివేశాలకంటే ఎమోషన్ సీన్స్ ఎక్కువగా ఉంటాయని సమాచారం. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ బ్యానర్లో బిబో శ్రీనివాస్ సమర్పణలో జాగర్లమూడి సాయిబాబా, రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్న సినిమాకి అహంబ్రహ్మాస్మి అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే అది కేవలం వర్కింగ్ టైటిల్ అని తెలిసింది. వచ్చేనెల మొదటివారంలో టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇప్పటికే సినిమా 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే చివరి షెడ్యూల్ మొదలు పెట్టనుంది. మొదటి సినిమాతో జాతీయ అవార్డు సొంతం చేసుకున్న సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus