టాలీవుడ్ సినిమాల హిట్ సీజన్ గురించి మాట్లాడటం మొదలుపెడితే ముందుగా గుర్తొచ్చేది ‘సంక్రాంతి’. టాలీవుడ్‌లో హిట్‌ల గురించి డిస్కషన్ పెడితే తొలి స్థానంలో నిలిచే సమయం ‘సంక్రాంతి’. టాలీవుడ్‌లో బెస్ట్ సినిమా క్లాష్‌ల గురించి చర్చ పెడితే తప్పకుండా గుర్తొచ్చే టైమ్ ‘సంక్రాంతి.
అంత ప్రాముఖ్యత ఉంది తెలుగు సినిమాలకు సంక్రాంతితో. వచ్చే సంక్రాంతికి టాలీవుడ్ నుండి మూడు సినిమా బరిలో ఉంటాయని ప్రాథమిక సమాచారం. మహేష్‌బాబు ‘సర్కారు వారి పాట’, పవన్ – రానా ‘అయ్యప్పనుమ్ కొశియమ్’ రీమేక్, ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సంక్రాంతి బరిలో ఉన్నాయి. మరి ఆ హీరోలకు గతంలో సంక్రాంతికి ఏం జరిగిందో చూద్దాం!
మహేష్‌తో మామూలుగా ఉండదు
సంక్రాంతి సీజన్ అంటే మహేష్‌కి, ఆయన అభిమానుకలు పూనకాలు వచ్చేస్తాయి. ఎందుకంటే ఆ సీజన్‌లో మహేష్ ఇచ్చిన హిట్లు మామూలుగా లేవు కాబట్టి. 2002లో ‘టక్కరిదొంగ’తో వచ్చిన మహేష్ విజయం అందుకోలేదు కానీ ప్రయోగానికి శబ్భాష్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత ‘ఒక్కడు’, ‘బిజినెస్ మ్యాన్’, ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘1 నేనొక్కడినే’, ‘సరిలేరు నీకెవ్వరు’ అంటూ వరుసగా వచ్చి హిట్లు కొట్లాడు. ఇప్పుడు ‘సర్కారు వారి పాట’ అంటూ మోత మోగించడానికి వస్తున్నాడు.
పవన్ ట్రెండ్ మారుస్తాడా?
టాలీవుడ్‌లో సంక్రాంతి సీజన్ అంటే భయపడే అభిమానుల్లో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఒకరు. కారణం ఇప్పటివరకు ఆ సీజన్‌లో వచ్చిన పవన్ సినిమాలు రెండూ ఆశించినమేర ఆకట్టుకోకపోవడమే. 2015లో ‘గోపాల గోపాల’ కోసం వెంకటేశ్‌తో కలసి వచ్చారు పవన్. సినిమా విజయం సాధించినా.. ఎక్కడో చిన్న వెలితి అయితే ఫ్యాన్స్‌కు ఉండిపోయింది. ఇక 2018లో సంక్రాంతికి వచ్చిన ‘అజ్ఞాతవాసి’ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. ఈ రెండు గాయాల్ని మార్చడానికి ‘భీమ్లా నాయక్’గా పవన్ నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నాడు.
ఎన్నో నెలల నిరీక్షణ తర్వాత.
ప్రభాస్ అభిమానులు ‘బాహుబలి’ అప్‌డేట్స్ కోసం ఎంతగా వేచి చూశారో… ‘రాధే శ్యామ్’ సినిమా కోసం అంతగా వెయిట్ చేశారు. నెలల తరబడి నానిన ఈ సినిమా వచ్చే సంక్రాంతికి వస్తోందని తాజాగా ప్రకటించారు. గతంలో ప్రభాస్ సంక్రాంతి ట్రాక్ రికార్డు చూసుకుంటే… 2004లో ‘వర్షం’ వచ్చింది. రికార్డుల జడివానలో బాక్సాఫీసును తడిపేసింది. అయితే 2008లో వచ్చిన ‘యోగి’ అభిమానుల్లో శోకం నింపింది. మరిప్పుడు ‘రాధే శ్యామ్’ ఏం చేస్తుందో చూడాలి.
Most Recommended Video
ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!