సంక్రాంతి సినిమాల బ్రేక్ ఈవెన్ టార్గెట్లు ఇవే..!

2024 సంక్రాంతి సీజన్లో ‘గుంటూరు కారం’ ‘హనుమాన్’ ‘సైంధవ్’ ‘నా సామి రంగ’ వంటి క్రేజీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇవన్నీ వేటికవే ప్రత్యేకమైనవి. అయినప్పటికీ ఒకదానికి ఇంకోటి గట్టి పోటీ ఇచ్చేలానే కనిపిస్తున్నాయి. అయితే మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఫస్ట్ ఛాయిస్ గా మారిపోయింది. మొదటి రోజు ఆ సినిమా టాక్ తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ ని సాధిస్తుంది అనడంలో సందేహం లేదు. ఆ తర్వాత ‘హనుమాన్’ సినిమా పై జనాల ఫోకస్ ఉంది.

ఈ సినిమా కూడా చిన్న పిల్లలని, ఫ్యామిలీ ఆడియన్స్ ని కచ్చితంగా థియేటర్ కి రప్పిస్తుంది అని అంతా నమ్ముతున్నారు. ఇక ‘సైంధవ్’ ‘నా సామి రంగ’ పై కూడా అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. అయితే వీటి థియేట్రికల్ బిజినెస్.. వ్యవహారాలు ఎలా ఉన్నాయి.. ఏ సినిమా ఎంత కలెక్ట్ చేస్తే సేఫ్ అవుతుంది అనే ప్రశ్నలు అందరిలోనూ ఉన్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ‘గుంటూరు కారం’ సినిమా రూ.135 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది. ఇది చిన్న టార్గెట్ అయితే కాదు చూడాలి మరి.

ఇక ‘హను-మాన్’ సినిమా రూ.25 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయాలి. దీనికి కూడా పాజిటివ్ టాక్ రాకపోతే కష్టమే. అలాగే ‘సైంధవ్’ కూడా రూ.25 కోట్లు షేర్ ను రాబట్టాలి. ఇక నాగార్జున ‘నా సామి రంగ’ సినిమా రూ.18 కోట్ల షేర్ ను రాబడితే సేఫ్ అయిపోయినట్టే..! హిట్ టాక్ వస్తే .. ‘నా సామి రంగ’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవడం ఈజీ అనే చెప్పాలి.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus