సంక్రాంతికి ‘గుంటూరు కారం’ ‘ప్రాజెక్ట్ కె’ ‘గేమ్ ఛేంజర్’ వంటి సినిమాలు వస్తాయని మేకర్స్ అనౌన్స్ చేశారు. దీంతో 2024 సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సందడి గట్టిగా ఉంటుంది అని అంతా భావించారు. కానీ తర్వాత పరిస్థితి మారిపోయింది. ‘ప్రాజెక్ట్ కె’ రేస్ నుండి తప్పుకుంది. సమ్మర్ కి ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో .. అంచనా వేయడం కష్టంగా మారింది.
దిల్ రాజు కూడా పరోక్షంగా ఇదే చెబుతున్నాడు. అంతా ‘శంకర్ గారి చేతిలోనే ఉంది’ అని..! ఇక ‘గుంటూరు కారం’ సినిమా అయితే 90 శాతం పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోపక్క రవితేజ ‘ఈగిల్’ జనవరి 13 న రిలీజ్ కాబోతున్నట్టు ప్రకటించారు.విజయ్ దేవరకొండ- పరశురామ్ కాంబినేషన్లో రూపొందుతున్న రెండో సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ కూడా సంక్రాంతి (Sankranti Movies) సీజన్ నే టార్గెట్ చేసింది.
అలాగే నాగార్జున ‘నా సామి రంగ’ కూడా సంక్రాంతికే వస్తుందని చెప్పకనే చెప్పారు. మళ్ళీ ‘సైందవ్’ అంటూ వెంకటేష్ కూడా వచ్చి చేరాడు. ఇవి చాలవు అన్నట్టు డబ్బింగ్ సినిమాలు కూడా వస్తున్నట్టు అధికారిక ప్రకటనలు వస్తున్నాయి. విచిత్రం ఏంటంటే ఇప్పటి వరకు సంక్రాంతికి అనౌన్స్ చేసిన సినిమాల షూటింగ్ పార్ట్ లు కంప్లీట్ కాలేదు. ఇంకా చాలా పార్ట్ కంప్లీట్ కావాలి. ఈ గందరగోళం పై క్లారిటీ రావాలి అంటే డిసెంబర్ వరకు వెయిట్ చేయాలి
గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు