సంతానం సినిమా పోస్ట్ పోన్ అయ్యింది!

తమిళంతోపాటు తెలుగులోనూ సమానమైన స్టార్ డమ్ కలిగిన కమెడియన్ సంతానం. ఒకపక్క కమెడియన్ గా పెద్ద హీరోల సినిమాల్లో నటిస్తూనే.. మరోపక్క తాను హీరోగా చిన్న లేదా మీడియం బడ్జెట్ సినిమాల్లో నటిస్తూ తమిళనాట స్టార్ నటుడిగా కొనసాగుతున్నాడు. అప్పుడప్పుడు తన స్వీయనిర్మాణంలో రూపొందిన సినిమాల్లో హీరోగా నటిస్తూ నిర్మాతగానే ఘన విజయాలు అందుకొంటూ వస్తున్నాడు.

సంతానం హీరోగా నటించిన తాజా తమిళ చిత్రం “దిలక్కు దుట్టు”. హారర్ కామెడీ స్పూఫ్ గా తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ కు తమిళనాట మంచి స్పందన లభించింది. ఈ సినిమాను తెలుగులోనూ అనువాదరూపంలో విడుదల చేసేందుకు మన తెలుగు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.

కాగా.. ఇటీవల తన తండ్రి మరణం కారణంగా ఈ సినిమాకి టైమ్ కి డబ్బింగ్ చెప్పలేకపోయాడట సంతానం. దాంతో పోస్ట్ పోన్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ లో ఉండిపోయాయి. ఆ కారణంగా ఈ నెలాఖరుకు విడుదల చేయాల్సిన సినిమాని వచ్చే నెలకు పోస్ట్ పోన్ చేసినట్లు తెలుస్తోంది!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus